అర్దరాత్రి భార్య కళ్లముందే అత్తను చంపేసిన అల్లుడు, అర్దరాత్రి ముసుగు వెసుకుని వెళ్లి?
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. అయితే ఒక్క విషయంలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య చెప్పిన మాట ఏమాత్రం వినకుండా భర్తకు ఎదురు తిరగడం మొదలుపెట్టింది. కూతురు కళ్ల ముందే ఆమె తల్లిని హత్య చేసిన వ్యక్తి ఎస్కేప్ అయ్యాడు. అయితే ముఖానికి ముసుగు వేసుకుని వెళ్లి అత్తను ఆమె అల్లుడే హత్య చేశాడని పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
అత్తను హత్య చేసిన కేసులో ఆమె అల్లుడు కాంతరాజ్ హంతకుడు అని పోలీసులు తెలిపారు. ఈ హత్య కర్ణాటకలోని మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని ఎలెకెరె గ్రామంలో జరిగింది. అర్ధరాత్రి 12.30 గంటలకు అర్పితా అనే మహిళ కళ్ల ముందే ఆమె తల్లి పార్వతమ్మ(50) హత్యకు గురైంది. రాత్రి ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి తన తల్లి పార్వతమ్మను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడని అర్పితా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హత్య కేసును విచారించిన పోలీసులు అత్త పార్వతమ్మను ఆమె కూతురు అర్పితా భర్త కాంతరాజ్ హత్య చేశాడు అనే షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. అర్పితా ఆమె భర్త కాంతరాజ్ తో నిత్యం గొడవలు పడి తరువాత తల్లి పార్వతమ్మ ఇంటికి వెళ్లిపోయింది. ఇదే విషయంలో అల్లుడు కాంతరాజ్ అత్త పార్వతమ్మ మీద పగ పెంచుకున్నాడని, అత్తను హత్య చేసేందుకు పథకం పన్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
పార్వతమ్మ, ఆమె కుమార్తె అర్పితా కార్తిక సోమవారం పండుగ రోజు దేవునికి పూజ చెయ్యడానికి వెళ్లారు. పూజ ముగించుకుని రాత్రి తిరిగి వచ్చే సమయంలో వారిని వెంబడించిన అల్లుడు కాంతరాజు మారువేషంలో శరీరం మీద జర్కిన్ ధరించి ముఖానికి మాస్క్ వేసుకుని వెళ్లి అత్త పార్వతమ్మను హత్య చేశాడని, తరువాత అల్లుడు కాంతరాజు ఎవరికీ తెలియకుండా చీకటిలో పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
సొంత భార్య అర్పితా కూడా మారువేషంలో వచ్చిన హంతకుడు తన భర్త కాంతరాజ్ అని గుర్తించలేకపోయిందని పోలీసులు అన్నారు. అత్త పార్వతమ్మను చంపిన కాంతరాజ్ ఏమీ తెలియనట్లు ఇంట్లోనే ఉన్నాడని, అనుమానం వచ్చి అతన్ని విచారించగా అసలు విషయం బయటపడిందని, తన భార్య అర్పితా తనకు కాకుండా పోవడానికి అత్తమామలే కారణమని కోపంతో పార్వతమ్మను హత్య చేశానని కాంతరాజు అంగీకరించాడని మండ్య పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications