అర్దరాత్రి తండ్రిని చంపేసిన కొడుకు, భార్యకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే ?, కన్నింగ్ !
చెన్నై/ కడలూరు: దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. దంపతులకు కష్టపడి కొడుకును పెంచి పోషించి అతనికి పెళ్లి చేశారు. కొడుకు, అతని భార్యతో సంతోషంగా కాపురం చేసి పిల్లలకు తండ్రి అయ్యాడు. తల్లిదండ్రులు ఒక ఇంటిలో, కొడుకు అతని భార్య, పిల్లలు అదే భవనంలోని మరో ఇంటిలో నివాసం ఉంటున్నారు. అయితే అక్కడే అసలు కథ మొదలైయ్యింది.
తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటి పక్కన ఉన్న ఎల్‌ఎన్ పురం ప్రాంతానికి చెందిన గవర్నర్ రాము అలియాస్ రాము (69) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాము సైకిల్ రిపేర్ షాప్ నడిపేవాడు. గత నెల 24వ తేదీ రాత్రి యథావిధిగా ఇంటి ముందు పడుకుని నిద్రపోయిన రాము మరుసటి రోజు ఉదయం చూసే సరికి రక్తపు గాయాలతో ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు.

అనంతరం స్నిఫర్ డాగ్‌ని పిలిపించి, హత్యకు గల కారణాలపై చురుగ్గా విచారణ జరుపుతుండగా మృతుడి కుటుంబ సభ్యులందరి సెల్‌ఫోన్ నంబర్లను పోలీసులు చురుగ్గా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. రాము కొడుకు పురుషోత్తమన్ (45) మా నాన్నను కొట్టి చంపేశానంటూ అతని భార్యతో మాట్లాడిన 20 నిమిషాల ఆడియో టేపు స్వాధీనం చేసుకుని అందులోని మాటలు విన్న పోలీసులు షాక్ అయ్యారు.

ఇంటి స్థలం పంపకాల విషయంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో తండ్రి రామును రోలింగ్ రాడ్ తో కొట్టి చంపినట్లు ఆయన కుమారుడు పురుషోత్తమన్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపాడు. అయితే అంతకు ముందే తన తండ్రి రామును ఎవరో కొట్టి చంపారని ఆయన కొడుకు పురుషోత్తమన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పురుషోత్తమన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంటి స్థల వివాదంతో తండ్రిని ఆయన సొంత కొడుకు కొట్టి చంపిన ఘటన పన్రుటి ప్రాంత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆస్తి కోసం కన్నతండ్రిని ఆయన కొడుకు హత్య చెయ్యడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications