The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా నిషేధించడంపై సుప్రీం నోటీసులు..
'ది కేరళ స్టోరీ' సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లో సినిమా ఎందుకు నిషేధించారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. చిత్రం నిషేధం వెనక ఉన్న హేతుబద్ధత ఏంటో చెప్పాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. "పశ్చిమ బెంగాల్ సినిమాను ఎందుకు నిషేధించాలి? దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇదే విధమైన జనాభా కూర్పు ఉన్న రాష్ట్రాలతో సహా ఇది నడుస్తోంది. ఏమీ జరగలేదు. దీనికి సినిమా కళాత్మక విలువతో సంబంధం లేదు" అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ కూడిన బెంచ్ అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో విద్వేషం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకూడదన్న ఉద్దేశంతో బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. సోమవారం మమతా బెనర్జీ ది కేరళ స్టోరీ మూవీపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో ఉంది. కేరళకు చెందిన 32,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని ట్రైలర్‌పై విమర్శలు వచ్చాయి.

"పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేరళ స్టోరీ చిత్రాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ద్వేషం, హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఈ నిర్ణయం" తీసుకున్నట్ల మమతా చెప్పారు ."కశ్మీర్ ఫైల్స్ అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. కేరళ కథ అంటే ఏమిటి?... ఇది వక్రీకరించిన కథే" అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ది కేరళ స్టోరీ నిషేధం చిత్ర నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రరయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం పశ్చిమ బెంగాల్ తో పాటు తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది.
తమిళనాడులో సినిమాని నిషేధించనప్పటికీ, థియేటర్ యజమానులు శాంతిభద్రతల సమస్యల కారణంగా దీనిని ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. చిత్ర నిర్మాతలు ఈ చర్యను "వాస్తవ నిషేధం" అని పేర్కొన్నారు. ది కేరళ స్టోరీలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలో 32,000 మంది మహిళలు బలవంతంగా ఇస్లాం మతంలోకి మారారని, వారు ISISలో చేరారని, ఇది తప్పుడు వాదన అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications