Atul Subhash: భర్తే భరణం ఇవ్వాలా.. భార్య ఇవ్వకూడదా..!
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్య వేధింపులు తట్టుకోలేక అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనతో భార్య బాధితులు మరోసారి తెరపైకి వచ్చారు. ముఖ్యంగా అతుల్ భార్యకు భరణం ఇవ్వలేక చనిపోవాల్సి వచ్చింది. విడాకులు తీసుకున్న ప్రతి భర్త భార్య భరణం చెల్లించాల్సిందేనా.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
సుప్రీం కోర్టు 8 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భర్త ఆర్థిక పరిస్థితి, అతని ఆదాయం, అప్పులు, మెయింటెన్స్ బాధ్యతలను బట్టి భరణం ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించవచ్చు. ఉద్యోగం చేసే స్థితిలో లేని భార్యకు విడాకుల సమయంలో న్యాయ పోరాటానికి తగిన మొత్తాన్ని భరించడం అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. భర్త, భార్య కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా పరిశీలించాలి. విడాకులు కోరుతున్న భార్య, భర్త విద్యార్హత, ఉద్యోగం తీరుతెన్నులు తెలుసుకోవాలి.

భార్య, ఆమెపై ఆధారపడిన పిల్లల అవసరాలను బట్టి కూడా భరణం ఇవ్వాలో లేదా నిర్ణయించవచ్చు. విడాకులు కోరిన భార్యాభర్తల వ్యక్తిగత ఆదాయం, వ్యక్తిగత ఆస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అత్తింట్లో భార్య గడిపిన జీవితం తాలూకూ స్థితిగతుల ఆధారంగా కూడా భరణం పై నిర్ణయం తీసుకోవచ్చు. కుటుంబ సంరక్షణ కోసం భార్య ఉద్యోగాన్ని వదిలేసిందా..? అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి.
అతుల్ కేసులో భార్య రూ.3 కోట్ల భరణం అడిగినట్లు తెలిస్తోంది. అంతేకాదు తన కొడుకును చూడడానికి తన భార్య రూ.30 లక్షలు అడిగినట్లు వీడియోలో చెప్పాడు. దీంతో ప్రస్తుతం భరణంపై చర్చ కొనసాగుతోంది. అయితే భర్తకు ఎలాంటి ఆదాయం లేదు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. అలాంటి సందర్బంలో భరణం ఎలా ఇస్తారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. భర్తకు ఎలాంటి ఆదాయం లేదు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. అదే సమయంలో భార్యకు ఉద్యోగం, ఆస్తి ఉంది. అప్పుడు భార్య భర్తకు భరణం ఇవ్వాలా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications