ఎంపీకి బిగ్ రిలీఫ్, అనర్హత వేటుపై స్టే, లోక్ సభ సమావేశాలకు ఎంట్రీ !

బెంగళూరు/న్యూఢిల్లీ: అనర్హత వేటు పడటంతో సతమతం అయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు తాత్కాలిక ఉపశమనం చిక్కింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తాత్కాలికంగా విజయం సాధించారు. మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ మనుమడు, జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య ధర్మాసం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తరువాత కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

Supreme Court

జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ పార్లమెంట్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆయనకు అవకాశం కల్పించారు. అయితే పార్లమెంటరీ భత్యాన్ని వినియోగించుకునేందుకు సుప్రీంకోర్టు జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు అనుమతి ఇవ్వలేదు.

JDS MP Prajwal Revanna

గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేశారు. ఆ సందర్బంలో ప్రజ్వల్ రేవణ్ణ ఆయన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, తరువాత ఎన్నికల్లో విజయం సాధించారని, ఆయన ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని అప్పటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. అప్పటికే నుంచి కేసు విచారణ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+