house owner: నగలు, నగదు లూటీ చేశాడు. క్లైమాక్స్ లో ఇంటి ఓనర్ ను గోకాడు, చుక్కలు !
ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంట్లోకి అర్దరాత్రి వెళ్లిన దొంగ నగదు, నగలు చోరీ చేసి సైలెంట్ గా వెళ్లిపోకుండా మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇంటి ఓనర్ ను గోకడంతో దొంగకు చుక్కలు కనపడ్డాయి.
చెన్నై/సేలం: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వ్యాధి నయం చేసుకోవడానికి అతను భార్యతో కలిసి కొంతకాలంగా ఆసుపత్రి చుట్టూ తిరిగాడు. చికిత్స విఫలమై భర్త చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంట్లో నగదు, నగలు చోరీ చేసిన ఓ దొంగ సైలెంట్ గా వెళ్లిపోకుండా మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇంటి ఓనర్ ను గోకడంతో దొంగకు చుక్కలు కనపడ్డాయి. మహిళ మీద దొంగ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది.

ఒంటరిగా ఉంటున్న మహిళ
తమిళనాడులోని సేలం జిల్లా తాలివాసల్ సమీపంలోని వరకూర్ కట్టుకోట్టై ప్రాంతంలో 40 ఏళ్ల మహిళ నివసిస్తోంది. మహిళ భర్త అనారోగ్యంతో 40 రోజుల క్రితం చనిపోయాడు. భర్త చనిపోవడంతో ఆ బాధలో ఉంటున్న మహిళ ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి అదే ఇంటిలో జీవిస్తున్నది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో వితంతువు ఇంట్లోకి చొరబడ్డ దొంగ ఇంట్లోని నగలు, డబ్బు, సెల్ ఫోన్ దోచుకున్నాడు.

సైలెంట్ గా వెళ్లిపోకుండా ?
ఇంట్లోకి దొంగ వచ్చి బీరువాలో ఉన్న నగలు, నగదు దోచుకున్నాడు అని ఆ మహిళ గుర్తించలేకపోయింది. నగలు, నగదు లూటీ చేసిన దొంగ సైలెంట్ గా బయటకు వెళ్లిపోకుండా ఇంట్లో ఒంటరిగా మహిళ మాత్రమే ఉందని, ఆమె భర్లలేడని తెలుసుకుని ఆమె మీద మోజుజపడ్డాడు. ఇంట్లో మగాళ్లు ఎవ్వరూ లేరని తెలుసుకున్న దొంగ నిద్రపోతున్న మహిళను కత్తితో బెదిరించి ఆమె మీద లైగింక వేధింపులకు పాల్పడ్డాడు.

దూలతీరింది వెదవకు ?
భయాందోళనకు గురైన మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వితంతువు ఇంటికి వెళ్లి దొంగను పట్టుకుని చితకబాది అతన్ని వీధిలోని విద్యుత్ స్థంభానికి కట్టేసి విచారించారు. సిరువాచూర్ సమీపంలోని ఇంటిలి గ్రామానికి చెందిన గోవిందసామి కుమారుడు ముత్తుక్కన్నన్ ఆ దొంగ అని తేలింది. సమాచారం అందుకున్న తలైవాసల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగ ముత్తు కన్నన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఒంటరిగా ఉన్న మహిళను లైగింక వేధింపులకు గురిచేసిన దొంగ స్థానికులకు చిక్కిపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications