Nursing Colleges: దేశంలో 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలతో పాటు ఇవి పనిచేస్తాయిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 1570 కోట్ల వ్యయంతో ఆమోదం లభించిందన్నారు. ఈ నర్సింగ్ కాలేజీల ఏర్పాటు వచ్చే 24 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన నర్సింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
కొత్తగా ఏర్పాటు చేసే నర్సింగ్ కాలేజీలను వైద్య కళాశాలలతో కలిపి ఉంచడంతో ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, స్కిల్ ల్యాబ్‌లు, క్లినికల్ సౌకర్యాలు, అధ్యాపక సిబ్బందిని వినియోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఈ 157 కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం 15,700 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్ల బయటకు రానున్నారు.ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక్కో నర్సింగ్ కాలేజీకి రూ. 10 కోట్లు కేటాయించనున్నారు.

నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో పాటు వైద్య పరికరాల రంగానికి సంబంధించిన విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రకారం కొత్త విధానంతో వచ్చే ఐదేళ్లలో వైద్య పరికరాల రంగం విలువ ప్రస్తుతం ఉన్న $11 బిలియన్ల నుంచి $50 బిలియన్లకు పెరుగనుంది.
మెడికల్ డివైజెస్ సెక్టార్ పాలసీలో అమలు కార్యాచరణ ప్రణాళికతో కూడిన ఆరు వ్యూహాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో ఛత్తీస్ గఢ్ దంతేవాడలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పయిన వారికి నివాళ్లు అర్పించారు.
ఇటు రాష్ట్రంలో కూడా ప్రతీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నర్సింగ్ విద్యకు ఈ ఏడాది బడ్జెట్ 26.24 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, మరో తొమ్మిది కాలేజీల పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం 26 కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో రెండు హైదరాబాద్‌లో, మిగతా ఏడు కామారెడ్డి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications