ఫేస్‌బుక్ కాసేపు ఆగింది: ట్విట్టర్ మోత మోగింది!
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నెటిజన్లు ఉపయోగించే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కొద్దిసేపు తన సేవలను నిలిపేసింది. ఇందుకు సంబంధించి ‘కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం'.. ‘పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం'అని ఫేస్‌బుక్ సంస్థ ఓ సందేశాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇబ్బంది తలెత్తినట్లు సమాచారం. దీంతో గురువారం మధ్యాహ్నం ఫేస్‌బుక్ కాసేపు(సుమారు 15 నిమిషాలపాటు) పని చేయలేదు. ఫేస్‌బుక్ ఖాతా తెరచుకోకపోవడంతో పలువురు ఖాతాదారులు వెంటనే ట్విట్టర్‌లోకి వచ్చి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు.

ఫేస్‌బుక్ ఎందుకు పని చేయడం లేదన్న పిర్యాదులు వెల్లువెత్తడంతో ట్విట్టర్ మోత మోగిపోయింది. కాగా, పావు గంట తర్వాత ఫేస్‌బుక్ తిరిగి పనిచేయడం ప్రారంభించింది. దీంతో ఫేస్‌బుక్ ఖాతాదారులు ఊపిరిపీల్చుకున్నారు. నేటి యువత, ప్రజలు ఫేస్‌బుక్‌కు ఎంత ప్రభావితమవుతున్నారో ఈ సందర్భాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.












Click it and Unblock the Notifications