బిజెపి చచ్చీ చెడి గెలిచినట్లే: విజయమే కాదని విశ్లేషకులు
Recommended Video

అహ్మదాబాద్: ప్రస్తుత ఫలితాల ధోరణి చూస్తుంటే గుజరాత్‌లో బిజెపి విజయం సాధించే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, అత్యంత కష్టంగా ఆ విజయం సాధించిందనే చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెసు గట్టి పోటీ ఇచ్చినట్లే.
బిజెపి చచ్చీచెడి గెలుస్తోందని, అది విజయమే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ విషయంలో ఇప్పటికైనా ప్రధాని మోడీ కళ్లు తెరవాల్సిందేనని అంటున్నారు. ఓటమి పాలైనా రాహుల్ గాంధీకి మోడీని ఎదుర్కోగలమనే ధైర్యాని రాహుల్ గాంధీకి ఇచ్చినట్లు భావిస్తున్నారు.

గుజరాత్‌లో మొత్తం 182 సీట్లు ఉండగా, ప్రస్తుత శాసనసభలో బిజెపి 117. కాంగ్రెసు సభ్యుల సంఖ్య 57. బిజెపి అధికారానికి అవసరమైన సీట్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ దాదాపు వందకు అటూ ఇటుగా ఒకటి రెండు సీట్లను మాత్రమే పొందగలిగే స్థితి ఉంది.
గుజరాత్‌లో గత 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని నిలబడడమే గొప్ప విజయంగా కూడా భావించవచ్చు. దానికితోడు, పలు సామాజిక వర్గాల నాయకులు ఎదురు తిరిగిన నేపథ్యంలో తాము నెట్టుకు రాగలిగామని బిజెపి సంతృప్తి చెందే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications