Dog: కుక్కకు సీమంతం.. వైరల్ అవుతోన్న వీడియో..
పెంపుడు జంతువులంటే చాలా మందికి ఇష్టముంటుంది. ముఖ్యంగా కుక్క అంటే చాలా మంది ఇష్టపడతారు. చాలా మంది కుక్కను ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. కుక్క వారి నుంచి దూరమైంతే చాలా బాధ పడుతుంటారు. ఇలానే ఖమ్మం పట్టణానికి చెందిన ఓ కుటుంబం పెంచుకుంటున్న కుక్క చనిపోవడంతో ఆ కుక్కకు మనిషిలాగానే అంత్యక్రియలు నిర్వహించారు. క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది ఆ కుక్క వర్ధంతి నిర్వహిస్తున్నారు.
2015 అక్టోబరు 2న పుట్టిన 'పుగ్ బ్రీడ్ కు చెందిన శునకాన్ని హైదరాబాద్ లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. కుక్కకు రెక్స్ అని పేరు పెట్టి కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకుంటున్నారు. ఆ కుక్కకు ప్రతీ సంవత్సరం అక్టోబరు 2న పుట్టిన రోజు కూడా ఘనంగా చేశారు. రెక్స్ 2021 జులై 20న అనారోగ్యంతో చనిపోయింది. తాజాగా ఓ కుక్కకు సీమంతం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఇంటిల్లిపాది చుట్టుపక్కల మహిళలు అంతా కలిసి కుక్కకు సీమంతం చేశారు. శునకం సీమంతానికి పండ్లు, పూలు కూడా పెట్టారు. దాని కోసం ఓ చీరను కొనుక్కొచ్చి కట్టారు. బొట్టు పెట్టి హారతి కూడా పట్టారు. కుక్క సీమంతం చేస్తుండగా అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళలకు సీమంతం ఎలా చేస్తారో అలానే కుక్క సీమంతం చేసి దాని ఉన్న ప్రేమను చాటుకున్నారు.
అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. వారికి కుక్కలంటే ఎంత ప్రేమో అని ఒకరు కామెంట్ చేయగా.. వైరల్ అవడం కోసమే ఇలా చేశారని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications