Chandrayaan 3: చంద్రయాన్-3 విజయంతో స్టెప్పులేసిన సోమనాథ్.. వీడియో వైరల్..
ఎంతో కష్టపడ్డారు. చంద్రయాన్-2 ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. 2019 జులై 22న చంద్రయాన్ 2 ను ప్రయోగించారు. అంతబాగానే ఉన్నా చివరి క్షణంలో ప్రయోగం విఫలమైంది. 2019 సెప్టెంబర్ 6న చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. దీంతో ఇస్రో శాస్త్రవేతలు ఎంతో ఫీల్ అయ్యారు. ఎంతో కష్టపడి చంద్రయాన్ 2 పంపితే చివరి క్షణంలో కూలిపోవడంతో అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ చాలా బాధపడ్డారు.
కానీ నెలకు తాకిన బంతి వలే మన ఇస్రో శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్-3కి రూపకల్పన చేశారు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న పాఠాలతో పకడ్బందీగా చంద్రయాన్-3 చంద్రుడికి పైకి పంపారు. విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేశారు. దీంతో ఇస్రో శాస్త్రవేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఓటమి తర్వాత వచ్చిన గెలుపు మజా లెక్కె వేరుటుంది.

దీంతో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చంద్రయాన్ 3 విజయవంతం అవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేతలు సంబురాలు చేసుకున్నారు. డ్యాన్సులు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోమానాథ్ సైతం ఇస్రో శాస్త్రవేతలతో కలిసి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా జయహో భారత్ అంటూ కామెంట్లు చేశారు. ఇస్రో శాస్త్రవేతలను పొగడ్తాలతో ముంచెత్తారు.
చంద్రయాన్ 3 విజయాన్ని ఇస్రో శాస్త్రవేతలే కాదు యావత్ భారతావని సెలబ్రెషన్ చేసుకుంది. మరోవైపు చంద్రుడి పై ల్యాండర్ ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు చంద్రుడి పైకి సోవియట్ యూనియన్, అమెరికా, చైనా ల్యాండర్లను పంపాయి. తాజాగా భారత్ కూడా చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపింది.












Click it and Unblock the Notifications