Viral Video: ఎంటి ఎక్కువ చేస్తున్నవు.. వరుడికి షాకిచ్చిన వధువు
పెళ్లిళ్లకు సంబంధంచిన కొని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడంతో రకరకాల ఫన్నీ, ఇంట్రెస్టింగ్ వెడ్డింగ్ వీడియోలు రోజుకోటి వైరల్ అవుతున్నాయి. వధూవరులకు సంబంధించిన అన్ని వీడియోలు సరదాగా ఉండవు కొన్ని బీభత్సాన్ని సృష్టిస్తాయి. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో జయమాల వేడుక నిర్వహించిన తర్వాత వధూవరులు వేదికపై వచ్చారు. దండలు మార్చుకున్న తరువాత, ఇద్దరూ ఒకరికొకరు బలవంతంగా మిఠాయిలు తినిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. వధువు లడ్డూను వరుడికి తినిపంచాలని ప్రయత్నంచింది అప్పుడు వరుడు నోరు బిగించాడు. అయినా పెళ్లి కూతురు తినిపించింది. తర్వాత వరుడు తన చేయి చాచినప్పుడు, వధువు కూడా అదే విధంగా ప్రవర్తించింది.

వరుడు ఆమెకు మిథాయ్‌కి బలవంతంగా తినిపించాడు. దీంతో వధువు కోపంతో వరుడి చెంప చెల్లుమనిపించింది. ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. వీడియోతో "ఆజ్ కల్ ఫ్యాషన్ హో గయా హై క్యా యే సబ్?" రాశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది దానిపై నవ్వుతూ ఎమోజీలు చేస్తున్నారు.వారి స్నేహితులను ఆటపట్టించడానికి ట్యాగ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications