గాలి కుమార్తె పెళ్లి ఖర్చు ఎంతంటే ? రికార్డు బద్ధలు
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. పెళ్లి ఖర్చు విషయంలో వెనక్కి తగ్గరాదని నిర్ణయించారని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అంటున్నారు.
కర్ణాటక రాజకీయాలలో చక్రం తప్పి తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డి తిరుగులేని మనిషిగా ఎదిగాడు. బళ్లారి జిల్లాలో తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించారు.
ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఏకైక కుమార్తె బ్రహ్మణి వివాహాన్ని హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డితో వైభవోపేతంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శుభలేఖలు కళ్లు తిరిగిపోయే రీతిలో ఉన్నాయి. కేవలంతో కర్ణాటకలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో గాలి కుటుంబ సభ్యులకు బంధు మిత్రులు ఉన్నారు.
గాలి కుమార్తె పెళ్లి 11 రోజులు: ఎస్ఆర్ కే, కత్రినా డ్యాన్స్ !
పలు రాజకీయ పార్టీల నాయకులు గాలికి సన్నిహితంగా ఉన్నారు. తన ఏకైక కుమార్తె బ్రహ్మిణి వివాహం చరిత్రలో నిలిచిపోయేలా జరిపించాలని గాలి నిర్ణయించారని తెలిసింది. గతంలో జీవీ. కృష్ణారెడ్డి మనవడు మాలిక్ వివాహం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి చేశారని వెలుగు చూసింది.

2004లో లక్ష్మీ మిట్టల్ తన కుమార్తె వివాహాన్ని రూ. 220 కోట్లు ఖర్చు పెట్టి చేశారని, అదే ఏడాది సహారా గ్రూప్స్ యజమాని సబ్రతోరాయ్ తన కుమారుల వివాహాలను రూ. 552 కోట్లు ఖర్చు పెట్టి చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పంపించిన శుభలేఖలు చూసిన వారు ఔరా ! అంటూ ఆశ్చర్యానికి గురౌతున్నారు. శుభలేఖలే ఇలా ఉంటే పెళ్లి ఇంక ఏలా ఉంటుందో అని ఊహించుకుంటున్నారు. గతంలో ఉన్న రికార్డులను తిరగరాస్తూ తన కుమార్తె వివాహం జరిపించాలని గాలి జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం 11 రోజుల పాటు బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. బళ్లారి జిల్లా నుంచే సుమారు లక్ష మంది పెళ్లికి వస్తారని గాలి అనుచరులు అంచనా వేస్తున్నారు.
అంతే కాకుండా బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులతో సహ బాలీవుడ్ సినీ ప్రముఖులు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహానికి హాజరుకానున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వంటలు చేయ్యడానికి ఇప్పటికే 9 రాష్ట్రాల నుంచి వంట మనుషులను పిలిపిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం చరిత్రలో నిలిచిపోవడం ఖాయం అంటున్నారు ఆయన అనుచరులు.












Click it and Unblock the Notifications