పెళ్లి జరిగిన రెండు వారాలకే ఏం జరిగిందంటే ?, అక్రమ సంబంధం మోజులో ఎంజాయ్, కట్ చేస్తే !
కుటుంబ సభ్యులు ఓ యువతికి పెళ్లి సంబంధాలు చూశారు. చాలా చోట్ల పెళ్లి సంబంధాలు చూసినా ఆ యువతికి పెళ్లి సెట్ కాలేదు. చివరికి ఓ యువకుడితో ఆమె పెళ్లి ఫిక్స్ అయ్యింది. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి గ్రాండ్ గానే జరిగింది. పెళ్లి జరిగిన కేవలం రెండు వారాలకే అక్రమ సంబందం విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. తరువాత భార్య శవమై కనిపించింది.
బెంగళూరు నగర శివార్లలోని డాబస్ పేట సమీపంలోని త్యామగుండ్లు సమీపంలోని సుబ్రమణ్యనగరలో రాధ (32) అనే యువతి నివాసం ఉంటున్నది రాధకు పలు చోట్ల పెళ్లి సంబంధాలు చూసినా ఆమెకు అంత త్వరగా పెళ్లి సెట్ కాలేదు. తరువాత బందువులు, స్నేహితులు త్యామగుండ్లు లో నివాసం ఉంటున్న రుద్రేష్ అనే యువకుడితో రాధ పెళ్లి జరిపిస్తే బాగుటుందని ఆమె కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు.

రుద్రేష్ ను పెళ్లి చేసుసుకోవడానికి రాధ కూడా ఓకే చెప్పింది. డాబస్ పేట్ లోని ఓ కల్యాణమండపంలో అందరి సమక్షంలో రుద్రేష్, రాధల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి రుద్రేష్, రాధ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. వివాహం చేసుకున్న తరువాత రాధ ఆమె భర్త రుద్రేష్ ఇంటికి వెళ్లింది. తరువాత రాధ జీవితంలో అసలు కథ మొదలైంది.
వివాహం జరిగిన కేవలం 15 రోజులకే భర్త రుద్రేష్ అక్రమ సంబంధం విషయం అతని భార్య రాధకు తెలిసిపోయింది. పెళ్లికి ముందే ఇద్దరు మహిళలతో తన భర్త రుద్రేష్ కు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న రాధ ఇంట్లో భర్తతో గొడవపడింది. ఇదే విషయంలో రుద్రేష్, రాధ దంపతులు నిత్యం గొడవలుపడ్డారు. రోజురోజుకు గొడవలు ఎక్కువ కావడంతో విసిగిపోయిన రాధ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

కుటుంబ సభ్యులు, బంధువులు రుద్రేష్, రాధలను కుర్చోబెట్టి రాజీపంచాయితీలు చేశారు. ఇక ముందు పరాయి స్త్రీల దగ్గరకు వెళ్లనని, తన భార్య రాధతో చక్కగా కాపురం చేసుకుంటానని పంచాయితీలో రుద్రేష్ మాట ఇచ్చాడు. అయితే కొన్ని రోజులకు మళ్లీ మమాలు అయ్యింది. తరువాత దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. అయితే తన భర్త రుద్రేష్ మారడు, అతని బుద్దిమారదు అనుకున్న రాధ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య రాధ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరిపించాడని కేసు నమోదు చేసిన పోలీసులు రుద్రేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications