లవ్ మ్యారేజ్, భర్తకు రోజు నైట్ డ్యూటీ, అర్దరాత్రి భార్య ఏం చేసిందంటే?, అందరూ షాక్!
చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగిన అమ్మాయి, అబ్బాయి మొదట స్నేహితులు అయ్యారు. కాలేజ్ లో చదువుకునే సమయంలో అదే అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. హ్యాపీగా తిరిగిన ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉండటంతో ప్రియురాలి కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే భర్త రోజు నైట్ డ్యూటీ చేస్తుండటంతో అక్కడ కథ అడ్డం తిరిగింది.
ఎనిమిది నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న కర్ణాటకలోని మల్నాడుకు చెందిన నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దురదృష్టకర ఘటనతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా నల్లూరు కొలిగె గ్రామ పరిధిలోని దసనకొడిగె గ్రామంలో చోటుచేసుకుంది. షమిత (24) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని తీర్థహళ్లి పోలీసు అధికారులు తెలిపారు.

షమిత భర్త విద్యార్థి సోమేశ్వర అలియాస్ సోమేశ్వర కర్ణాటక అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. కాలేజ్ లో చదివే సమయంలో ప్రేమించుకున్న సోమేశ్వర్, షమిత తరువాత ఇరువైపుల కుటుంబ సభ్యులపు ఒప్పించి అందరి సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్న సోమేశ్వర్ ఎక్కువగా నైట్ డ్యూటీ చేస్తున్నాడని తెలిసింది.
రాత్రి భర్త సోమేశ్వర్ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో షమిత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటున్నారు. గత ఏడాది మార్చిలో షమిత, సోమేశ్వర్ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత షమిత, సోమేశ్వర్ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని, ఇద్దరి మద్య ఎలాంటి గొడవలు లేవని ఇరువైపుల కుటుంబ సభ్యులు, బందువులు అంటున్నారు.
బుధవారం రాత్రి అత్తతో డిన్నర్ చేసిన షమిత కొంతసేపు ఆమెతో మాట్లాడింది. తరువాత తాను తన రూమ్ లో పడుకుంటానని అత్తకు చెప్పిన షమిత ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లింది. గురువారం తెల్లవారుజామున షమిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం సోమేశ్వర్ తల్లి షమిత గది తలుపులు తీయాలని చెప్పింది. షమిత ఎంతసేటికి తలుపులు తియ్యకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కిటికీలోంచి చూడగా షమిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
షమిత తల్లిదండ్రులు వచ్చిన తర్వాత తలుపులు పగలగొట్టారు. షమిత మృతదేహం దగ్గర డెత్ నోట్ లభ్యమైంది. అనారోగ్య కారణాలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని షమిత డెత్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు. షమిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీర్థహళ్లిలోని జయచామరాజేంద్ర ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ జక్కన గౌడ్ సమక్షంలో పోస్టుమార్టం చేస్తున్నారు. అగుంబే పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications