హోటల్ ఓనర్ ప్రాణం తీసిన చికెన్ కబాబ్, రాత్రికి రాత్రి కోడి ఎలా వస్తుందిరా గాడిద?
బెంగళూరు/బాగల్ కోటే: బస్ స్టాండ్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి ఎగ్ రైస్. ఫ్రైడ్ రైస్, చికెన్ కబాబ్ తో పాటు మాంసాహార వంటకాలు విక్రయించే హోటల్ నిర్వహిస్తున్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు హోటల్ యజమాని ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఎగ్ రైస్, చికెన్ కబాబ్ కోసం హోటల్ యజమానిని అతని గొంతు కోసి దాణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
ఎగ్ రైస్, చికెన్ కబాబ్ లేదన్న కారణంతో ఓ యువకుడు ఓ హోటల్ యజమానిని కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా హునగుండ తాలూకా అమినగడ పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

గైబుసాబ్ ముల్లా అలియాస్ ముల్లా (34) అనే వ్యక్తి హత్యకు గురైనాడని, ముస్తాక్ జంగి (20) అనే యువకుడు హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అన్నారు.
అమీనగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి ముల్లా హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. ముల్లాను కత్తితో హత్య చేసి అదృశ్యం అయిన నిందితుడు ముస్తాక్ ను వెంటాడని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాగల్‌కోట్ జిల్లా అమిన్ గడ బస్టాండ్ సమీపంలో ఎగ్ రైస్ తో పాటు మాంసాహారం హోటల్ నిర్వహిస్తున్న ముల్లా వద్దకు ముస్తాక్ వెళ్లాడు.
తరువాత తనకు ఎగ్ రైస్, కబాబ్ కావాలని ముల్లాను ముస్తాక్ అడిగాడు. అప్పటికే రాత్రి చాలా ఆలస్యం కావడంతో ఎగ్ రైస్, చికెన్ కబాబ్‌లు అన్నీ అమ్ముడుపోయాయని, ప్రస్తుతానికి ఓ ముక్క కబాబ్ కూడా లేదని హోటల్ యజమాని ముల్లా తినడానికి వచ్చిన ముస్తాక్ కు చెప్పాడు. హోటల్ లో ఎగ్ రైస్ లేదని చెప్పడంతో ముస్తాక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అయితేన ముస్తాక్ తిరిగి హోటల్ వద్దకు వచ్చి కత్తితో ముల్లా మెడపై పొడిచి హత్య చేశాడు. నిందితుడు ముస్తాక్ గతంలో పలువురిపై దాడి చేసి జైలుకు వెళ్లాడని, ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ వార్త తెలియగానే అమీన్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి హత్య చేసిన నిందితుడు ముస్తాక్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications