sadist: తండ్రిని టక్కుతో తొక్కించి చంపేసిన కన్నింగ్ కొడుకు, మాట వినలేదని, చివరికి ?

చెన్నై/ కాంచీపురం: ఓ రైతుకు వ్యవసాయ భూములు, ఇళ్లు ఉంది. కొడుకులు, కూతురు పెళ్లి చేసుకుని ఎవరి పాటికి వాళ్లు కాపురాలు చేసుకుంటున్నారు. తండ్రి ఆస్తిలో భాగం పెట్టాలని చాలాకాలం నుంచి ఓ కొడుకు డిమాండ్ చేస్తున్నాడు. ఎంతకాలానికి తండ్రి ఆస్తి పంచిపెట్టలేదని రగిలిపోయిన కిరాతకుడైన కొడుకు పెద్ద ట్రక్కుతో అతని తండ్రిని తొక్కించి చంపేయడం కలకలం రేపింది. ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య చెయ్యడంతో రెండు కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి.

 ముగ్గురు కొడుకులు, కూతురు

ముగ్గురు కొడుకులు, కూతురు

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని వాలాజా్ సమీపంలోని దేవరియంబక్కంకు చెందిన ఎతిరాజ్ అలియాస్ రాజ్ (75) అనే రైతు నివాసం ఉంటున్నారు. ఎతిరాజ్ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎతిరాజ్ కు మూడో కుమారుడు రామచంద్రన్ (40). రామచంద్రన్ సొంతంగా ట్రక్కు తీసుకుని అద్దెలకు తిప్పుతూ డబ్బులు సంపాధిస్తున్నాడు.

 ఆస్తిలో భాగం పెట్టాలని చిన్న కొడుకు డిమాండ్

ఆస్తిలో భాగం పెట్టాలని చిన్న కొడుకు డిమాండ్

తనకు రావాల్సిన ఆస్తిలో, వ్యవసాయ భూమిలో భాగం పెట్టాలని చిన్న కొడుకు రామచంద్రన్ నిత్యం అతని తండ్రి ఎతిరాజ్‌తో నిత్యం గొడవ పడుతున్నాడు. సోమవారం రాత్రి రాత్రి రామచంద్రన్ అతని తండ్రి ఎతిరాజ్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. తనకు ఆస్తిలో భాగం ఎప్పుడు భాగం పెడుతారు అని అతని తండ్రి ఎతిరాజ్ ను నిలదీశాడు. నీ ఆస్తిలో తనకు హక్కు ఉందని, మర్యాదగా వ్యవసాయ భూమిలో భాగం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.

 రాత్రి పెద్ద గొడవ చేసిన కొడుకు

రాత్రి పెద్ద గొడవ చేసిన కొడుకు

ఆ సమయంలో తండ్రీ కొడుకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్న బంధువులు ఇద్దరినీ శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు. నీ అంతు చూస్తా అంటూ తండ్రి ఎతిరాజ్ ను హెచ్చరించిన రామచంద్రన్ అక్కడి నుంచి ఆవేశంగా అతని ఇంటికి వెళ్లిపోయాడు. ఎప్పటిలాగే మంగళవారం ఎతిరాజ్ శంకరాపురం రోడ్డుపై నడుచుకుంటూ ఆయన పొలం దగ్గరకు బయలుదేరాడు.

 ట్రక్కుతో తండ్రిని తొక్కించి చంపేసిన శాడిస్టు కొడుకు

ట్రక్కుతో తండ్రిని తొక్కించి చంపేసిన శాడిస్టు కొడుకు

తండ్రి ఎతిరాజ్ నడుచుకుంటూ వెలుతున్నాడని అతని చిన్న కొడుకు రామచంద్రన్ గమనించాడు. భారీ ట్రక్కును నడుపుకుంటూ వెళ్లిన రామచంద్రన్ అతని తండ్రి ఎతిరాజ్‌పైకి దూసుకెళ్లి హత్య చేసి ట్రక్కుతో సహ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎతిరాజ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎతిరాజ్ హత్యకు సంబంధించి పోలీసులు రామచంద్రన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య చోటుచేసుకున్న భూవివాదంలో కొడుకు తన తండ్రిని లారీతో ఎక్కించి హత్య చెయ్యడం తమిళనాడులో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+