youth: ఉద్యోగం ఇచ్చిన పాపానికి యజమానిని హత్య చేసిన యువకులు, జస్ట్ మిస్ !

చెన్నై/సేలం: పని ఇచ్చిన పాపానికి ఇద్దరు యువకులు షాప్ ఓనర్ ను దారుణంగా పొడిచి చంపేశారు.మరో యజమాని తప్పించుకున్నాడు. తమిళనాడులోని సేలం జిల్లా పక్కనే ఉన్న కడయం పట్టిఖదయ్యంపట్టి తాలూకాలోని దివట్టిపట్టి ప్రాంతంలో సేలం -బెంగళూరు హైవే రహదారిపై ఇద్దరు ఫ్రెండ్స్ ఐరన్ దుకాణం నడుపుతున్నారు. ధర్మపురిజిల్లాలోని బొమ్మిడి సమీపంలోని దురించిపట్టి నాతూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ (32), చెట్టియార్ కాడు ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ ఇద్దరూ ఈ ఐరన్ షాపు యజమానులు.

ఈ దుకాణంలో బీహార్‌లోని బెగుసిరా జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు పని చేసేవారు. సంతోష్, ప్రేమ్‌కుమార్ ఇద్దరూ బుధవారం రాత్రి ఐరన్ షాపు లో వ్యాపారం ముగించుకుని షాక్ కు తాళం వేసి రూ.4 లక్షలతో బయటకు వచ్చారు. ఆ సమయంలో షాపులో పనిచేసే ఇద్దరు బీహార్ యువకులుఇనుప దుకాణం యజమానులు ఇద్దరినీ కత్తులతో పొడిచారు.

The youth of Bihar brutally murdered the employer who gave him a job for Rs four lakhs near Salem.

అదృష్టవశాత్తూ ప్రేమ్‌కుమార్ తప్పించుకున్నాడు. సంతోష్‌కు తొడ, పొత్తికడుపుపై ​​మరింత కత్తితో పొడిచడంతో తీవ్రగాయాలై రక్తపు మడుగులో అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం ప్రేమ్‌కుమార్‌ కేకలు వెయ్యడంతో అరుపులు విని రోడ్డుపై ఉన్న జనం లోపలికి వెళ్లి ఓ యువకుడిని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను అంబులెన్స్‌లో ఓమలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంతోష్‌ను పరీక్షించిన వైద్యులు అతు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. ప్రేమ్ కుమార్ దివట్టిపట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రజల సాయంతో తప్పించుకున్న బీహార్ కు చెందిన మరో యువకుడిని పట్టుకున్నారు. ఓమలూరు డీఎస్పీ సంగీత సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

బీహార్ యువకులు ఉంటున్న గదిలో సోదాలు చేసి ఆధారాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు ఐరన్ షాపు యజమాని సంతోష్ ను డబ్బు కోసం హత్య చేశారా? మరేదైనా కారణం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+