అప్పుడు గుజరాత్ లో సీఎం,హోం వారే.. ఇప్పుడు ప్రధాని,హోం వీరే..! మోదీ. షా యే ఫెవికాల్ కా జోడీ హై..!!

ఢిల్లీ/హైదరాబాద్ : వారిద్దరూ ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న నేతలు. రాజకీయాల్లో హేమా హేమీలను, రాజకీయ ఉద్దండులు మట్టికరిపించని నేతలు. వారే ఒకరు మోదీ మరోకరు అమీత్ షా. అమిత్ షా.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ప్రదాని న‌రేంద్ర మోడీతో క‌లిసి బీజేపీకి స‌రికొత్త హంగులు అద్దుతూ క‌మ‌ల వికాసంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యంతో ఎంపీగానూ ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌కు అత్యంత కీల‌క‌మైన హోం శాఖ ద‌క్కింది. ఒక‌ప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న స‌మ‌యంలో ఆయ‌న కేబినెట్‌లో ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ప‌నిచేసిన షా.. ఇప్పుడు మ‌రోసారి మోడీ ప్రధాని అయ్యాక తిరిగి ఆయ‌న కేబినెట్‌లోనే ఏకంగా దేశ హోంశాఖ మంత్రి అయ్యారు. ఒక రాష్ట్రానికి సీఎం, హోంశాఖ మంత్రులుగా ప‌నిచేసిన ఇద్దరు వ్యక్తులు.. తిరిగి దేశానికి ప్రధాని, హోంశాఖ మంత్రులుగా ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి.

నాడు గుజ‌రాత్‌లో..! నేడు దేశంలో.. అవే పదవులు..!!

నాడు గుజ‌రాత్‌లో..! నేడు దేశంలో.. అవే పదవులు..!!

ఇంత‌గా పాపుల‌ర్ అయిన అమిత్ షా.. అస‌లు ఎవ‌రు..? ఎక్కడి వారు..? ఈ ప్రశ్నలకు స‌మాధానం చాలామందికి కొంచెమే తెలుసు. అమిత్ షా ఒక‌ప్పుడు గుజ‌రాత్ హోంమంత్రిగానే అంద‌రికీ సుప‌రిచితం. ఎందుకంటే ఉగ్రవాది సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంట‌ర్‌, హ‌రేన్‌పాండ్య హత్యకేసుల్లో అమిత్ షా పేరు ప్రముఖంగా వినిపించింది. సోహ్రబుద్దీన్‌ను షా గుజ‌రాత్ హోంమంత్రిగా ఉన్న స‌మ‌యంలో న‌కిలీ ఎన్‌కౌంట‌ర్ పేరిట చంపించార‌ని అభియోగాలు ఉండేవి. అయితే ఇటీవ‌లే ఆయ‌న‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. 1964 అక్టోబ‌రు 22న ముంబైలో అమిత్ షా పుట్టారు. తండ్రి పేరు అనిత్‌చంద్ర షా. ఈయ‌న గుజ‌రాత్‌కు చెందిన వ‌్యాపార వేత్త కావడం విశేషం.

 గుజ‌రాత్ సీఎంగా మోడీ..! హోంమంత్రిగా అమీత్ షా..!!

గుజ‌రాత్ సీఎంగా మోడీ..! హోంమంత్రిగా అమీత్ షా..!!

అమిత్ షా ముంబైలో పుట్టిన‌ప్పటికీ.. త‌ర్వాత ఆయ‌న కుటుంబం గుజ‌రాత్‌కు వెళ్లి స్థిర‌ప‌డింది. అహ్మదాబాద్‌లో బీఎస్సీ వ‌ర‌కు చ‌దివిని షా.. త‌ర్వాత రాజ‌కీయాల ప‌ట్ల ఆక‌ర్షితుడ‌య్యాడు. కాలేజీలో చ‌దివే రోజుల్లోనే ఆరెస్సెస్ కార్యకర్తగా ప‌నిచేశారు. త‌ర్వాత ఏబీవీపీలో చేరి విద్యార్థి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు. అప్పట్లో మోడీ ఆరెస్సెస్ ప్రచార‌క్‌గా ఉండేవారు. 1982లో తొలిసారిగా మోడీ, షాలు క‌లిశారు. అప్పట్నుంచి వారిద్దరి మ‌ధ్య స్నేహం చిగురించింది. ఆ త‌ర్వాత 1991లో సీనియ‌ర్ నేత ఎల్‌కే అద్వాణికి పోల్ మేనేజ‌ర్‌గా అమిత్ షా ప‌నిచేశారు. 1997లో అమిత్ షా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

 ఇప్పుడు ప్రధానిగా మోడీ..! దేశ హోంమంత్రిగా అమీత్ షా..!!

ఇప్పుడు ప్రధానిగా మోడీ..! దేశ హోంమంత్రిగా అమీత్ షా..!!

ఆ త‌ర్వాత మ‌రో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మోడీ సీఎం అయ్యాక ఆయ‌న‌తో ఉన్న స్నేహంతో షాకు మ‌హ‌ర్దశ ప‌ట్టింది. ఆయ‌న కేబినెట్‌లో గుర‌జాత్ హోంమంత్రిగా ప‌నిచేశారు. సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంట‌ర్‌, ఐపీఎస్ అధికారి హ‌రేన్‌పాండ్య హత్యకేసులో అమిత్ షా పేరు రావ‌డంతో ఆయ‌న పేరు దేశ‌వ్యాప్తంగా ప్రచారంలోకి వ‌చ్చింది. ఈ అభియోగాల నేప‌థ్యంలో షా గుజరాత్ హోంమంత్రిగా రాజీనామా చేశారు. ఆయ‌న‌పై సీబీఐ కేసు కూడా న‌మోదైంది. ఆ త‌ర్వాత 2014లో మోడీ ప్రధాని అయ్యాక మ‌రోసారి అమిత్ షా కీల‌క‌మ‌య్యారు. రెండేళ్లలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియ‌మితుల‌య్యారు.

ఎదురులేని నేతలు..! గురి పెడితే లక్ష్యాన్ని ఛేదించాల్సిందే..!!

ఎదురులేని నేతలు..! గురి పెడితే లక్ష్యాన్ని ఛేదించాల్సిందే..!!

ఆ త‌ర్వాత ఆయ‌న రాజ్యస‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇదే స‌మ‌యంలో అమిత్ షాపై ఉన్న కేసుల విష‌యంలో సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఒక‌వైపు పార్టీ సార‌థ్యం చూస్తూనే మ‌రోవైపు పాల‌న వ్యవ‌హారాల్లో షా క‌ల‌గ‌జేసుకునేవారు. తాజాగా జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎల్ కే అద్వాణి సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గాంధీన‌గ‌ర్ నుంచి పోటీ చేసి 5.57ల‌క్షల పైచిలుకు మెజార్టీతో అమిత్ షా గెలుపొందారు. ఒక‌ప్పుడు అద్వాణీకి పోల్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన వ్యక్తి.. అదే స్థానంలో బ‌రిలోకి దిగి ఎంపి అవ్వడం విశేషం. ఇప్పుడు ఏకంగా మోడీ కేబినెట్‌లో దేశ హోంశాఖ మంత్రి అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+