‘పార్లమెంటులోనే ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారు’
రూర్కీ: భారతీయ జనతా పార్టీ ఎంపి, విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారని ఆమె ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానం దోషి అని నిర్ధారించిన వారికి మద్దతుగా మాట్లాడేవారిపై ఆమె మండిపడ్డారు.
కోర్టులు దోషి అని నిర్ధారించిన వారిని వెనుకేసుకొచ్చేందుకు యత్నించిన ఒకరిద్దరు ఎంపీలు ఉగ్రవాదులేనని ఆమె చెప్పారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన వారిని కూడా శిక్షించాల్సిందేనని అన్నారు.
‘కొందరు నాయకులు యాకుబ్ మెమన్ ఉరి తర్వాత ఏడుస్తున్నారు. ఎలాగంటే.. రావణసురుడి మృతి తర్వాత మండోదరి ఏడ్చినట్లుగా' అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆమె యాకుబ్ మెమన్‌ను సమర్థించిన శతృజ్ఞ సిన్హా, శశిథరూర్ తదితరులను ఆమె ప్రస్తావించి ఉంటారని భావిస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపైనా ఆమె స్పందించారు. ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాదిని విచారించిన తర్వాత అతడ్ని ఏదైనా హిందూ సంస్థకు అప్పగించాలని కోరారు.
పాకిస్థాన్‍కు చెందిన ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడి ఇద్దరు జవాన్ల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవగా, మరో ఉగ్రవాదిని పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. ‘హిందువులను చంపడం నాకు సరదా' అని ఉగ్రవాది నవేద్ చేసిన వ్యాఖ్యలపై సాధ్వి ప్రాచీ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఉగ్రవాదులపైనే తమ పోరు అని చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications