Crime News: బావే కదా అని వెళ్తే.. ఓ సీఐ ఏం చేశాడో తెలుసా..?
పోలీసులంటే రక్షకభటులు.. మేమున్నాంటూ భరోసా ఇచ్చే బాధ్యత గల వ్యక్తులు.. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మనుషులు.. అవును చాలా మంది పోలీసులు పౌరులకు రక్షణగా మేమున్నామంటూ భరోసా ఇస్తూ.. ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం పోలీసు అన్న పదానికి మచ్చ తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని ఓ సీఐ మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ జరిపిన పోలీస్ శాఖ సదరు పోలీసును పోలీసు శాఖ నుంచి శాశ్వతంగా తొలగించింది.
కన్నడ పోలీస్
తెలుగు సీఐ లాగానే ఓ కన్నడ పోలీస్.. వరుసకు మరదలైన అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఒక్కటి కాదు రెండు కాదు ఐదేళ్లుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆ యువతి చివరకు పోలీసులను ఆశ్రయించడంతో అతడి విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకేరే పోలీస్ స్టేషన్‌లో ఉమేష్ అనే వ్యక్తి సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని వరుసకు మరుదలైన ఓ అమ్మాయి ఉంది. ఆమెకు ఆస్తి సమస్యలు వచ్చాయి. ఈ సాకు అతను ఆమెకు దగ్గరయ్యాడు. సమస్యలు పరిష్కరిస్తామంటూ తనపై అత్యాచారం చేశాడని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మూడో పెళ్లి
సీఐకి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని, తనను మూడో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోకుంటేనే ఆస్త సమస్యలు పరిష్కరిస్తానని.. లేకుంటే ఆస్తి దక్కనివ్వనని భయపెడుతున్నాడని యువతి వాపోతుంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ కోసం వెతుకున్నారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications