IT Jobs: ఇజ్రాయెల్ యుద్ధంతో ఇండియాలో ఐటీ ఉద్యోగాలు..!
పాలస్తీనాలోని గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై విచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ సరిహద్దును దాటి పలువురిని అపహరించుకోపాయారు హమాస్ తీవ్రవాదులు. ఆకస్మిక దాడి నుంచి తెరుకున్న ఇజ్రాయెల్ గాజాలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులో చేస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ఉన్న ఐటీ కంపెనీలు, అందులో పని చేసే ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఐటీ కంపెనీలు తమ ఆఫీసులు, ఉద్యోగులకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దీంతో ఇజ్రాయెల్ పని చేస్తున్న ఇతర దేశాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తిరిగి వారి దేశాలకు వెళ్లిపోతున్నారు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇజ్రాయెల్ కేంద్రం పలు ప్రాజెక్టులను రన్ చేస్తున్ ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను మరో చోటికి తరలించాలని చూస్తున్నాయి. అయితే ఆ ఐటీ ప్రాజెక్టులను ఇండియాకు కేటాయించాలని పలు ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ కు ఎక్కువగా ఐటీ నుంచి ఆదాయం వస్తుంది.

ఇజ్రాయెల్ కు ఐటీ ద్వారా 14 శాతం ఆదాయం వస్తుంది. ఐటీ రంగం ఆ దేశానికి చాలా కీలకం. యుద్ధంతో ఐటీ ఉద్యోగులతో పాటు, కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్ లో అమెరికా, యూకే, చైనా, ఫ్రాన్స్ చెందిన ఐటీ ప్రాజెక్ట్ వర్కు జరుగుతోంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు భయపడిపోతున్నారు. కంపెనీలు కూడా అక్కడ ఆఫీసులు నడపడానికి వెనకాడుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్, బాండ్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఐటీ ప్రాజెక్టులు తరలిపోయే అవకాశం ఉంది.
చాలా కంపెనీలు తమ ఐటీ ప్రాజెక్టులను భారత్ తరలించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఐటీ ప్రాజెక్టులు ఇండియాకు వచ్చినట్లైతే ఇక్కడ మరిన్ని ఐటీ ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. భారత్ లో కనీసం 10 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. దీంతో ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications