ఎందుకు పిలిచారో కేంద్రానికే క్లారిటీ లేదు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి ఎన్నికలు లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది.
దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి.

ఇందులో ఎలాంటి అంశాలు, బిల్లులు చర్చకు రానున్నాయనేది ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ భేటీ సందర్భంగా సభలో ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనిపై ఇదివరకే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ సైతం రాశారు.
ఇదిలా వుండగా- ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంల కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీ హాలులో ఈ మధ్యాహ్నం ఈ భేటీ ఏర్పాటైంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం డీఎంకే సభ్యురాలు కణిమోళి విలేకరులతో మాట్లాడారు. ఈ అయిదు రోజుల పార్లమెంట్ సమావేశాన్ని ఎందుకు పిలిచారనే విషయంపై అధికార పార్టీకే ఎలాంటి స్పష్టతా లేదని తేల్చి చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలో ఆమోదించాలని తాము కోరుకుంటోన్నామని అన్నారు.

దీనితో పాటు- మణిపూర్‌లో చెలరేగిన మారణహోమంపై చర్చించాలని తాము డిమాండ్ చేస్తోన్నామని అన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటోన్న నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, శాంతి భద్రతలు, కోటి ఉద్యోగాల కల్పన.. వంటి అనేక ఇతర అంశాలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు రాఘవ్ ఛద్దా, సంజయ్ సింగ్‌ల సస్పెన్షన్‌ను కూడా ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష పార్టీల సంకీర్ణ కూటమి తరఫున కోరుకుంటోన్నామని కనిమోళి చెప్పారు. ప్రత్యేక పార్లమెంట్‌లో చర్చించే అంశాల గురించి అఖిల పక్ష సమావేశాల్లో ప్రస్తావించలేదని ఆమె స్పష్టం చేశారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications