Train Accident: మహారాష్ట్రలో రైలు ప్రమాదం..
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మద్ నగర్- నారాయణ్ పూర్ స్టేషన్ల మధ్య 8 బోగీలతో ప్రయాణిస్తున్నఓ డెమోకు చెందిన 5 బోగీల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా రైలు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) ప్యాసింజర్ రైలులోని ఐదు కోచ్‌ల్వో సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని నారాయణ్‌దోహ్ స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి.
అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. బీడ్ జిల్లాలోని అష్టి స్టేషన్ నుంచి పశ్చిమ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ ఆదేశించారు.

నెల రోజుల క్రితం తమిళనాడు మధురైలో ఇలాంటి ప్రమాదం జరిగింది. బోగీల్లో మంటలు చెలరేగడంతో 10మంది మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మధురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న పునాలూర్- మధురై ఎక్స్‌ప్రెస్ లో ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ లో సిలిండర్ వాడడం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంది. జులైలో యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి బొమ్మాయి పల్లి మధ్య ఫలక్ నుమా రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన విషయం తెలిసింది.
#Maharashtra: Fire engulfs five coaches of passenger train in Ahmednagar district; no casualties. #TrainAccident #Railway #IndianRailway #IsraelGazaWar #AUSvsSL #Tiger3Trailer #BossSauceByNaukri #KGF2 #olympics2028 pic.twitter.com/PhxVDbAhtw
— Mohd Nazim 🇮🇳 (@mohdnazim03) October 16, 2023
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇక మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. అయితే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కొందరు ప్రయాణికులు రైళ్లలో ధూమపానం చేస్తారని.. ఇది ప్రమాదకరమని చెప్పారు.












Click it and Unblock the Notifications