మార్కెట్లు డౌన్ అవుతున్నా ఈ 3 స్టాక్స్ మాత్రం అదరగొడుతున్నాయి
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు రావడమే దీనికి కారణం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 230 పాయింట్లకుపైగా నష్టంతో 61 వేల 530 మార్కు వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 18 వేల 200 మార్కు ఎగువన నమోదవుతోంది.
ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ షేర్లు రాణిస్తున్నాయి. అదే సమయంలో టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు వెనుకంజ వేశాయి. S&P BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం పెరిగింది. మరోవైపు S&P BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం మేర పుంజుకుంది. మార్కెట్లు పడిపోతున్న సమయంలోనే కొన్ని స్టాక్స్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వేణు పైప్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్, ఇన్‌ఫ్లేమ్ అప్లియెన్స్ లిమిటెడ్, అశోకా బుల్డ్‌కాన్ లిమిటెడ్ స్టాక్స్ టాప్ పొజిషన్ లోకి దూసుకువెళ్లాయి.

Venu Pipes and Tubes Limited: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలను వేణు పైప్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ ప్రకటించింది. మార్చితో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 60 శాతం పుంజుకుంది. దీంతో ఆదాయం రూ.176 కోట్లుగా నమోదైంది. నెట్ సేల్స్ 43 శాతం పెరిగి రూ. 552 కోట్లుగా నమోదైంది.

Ashoka Buildcon Limited: 2023, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం సహా వార్షిక ఫలితాల్నిఅశోకా బుల్డ్ కాన్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ కంపెనీ నెట్ ఆర్డర్ రూ.15,805 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ రెవెన్యూ 25 శాతం పెరిగింది. Inflame Appliance Limited: ఈ కంపెనీ నికర లాభం ఏకంగా 1242 శాతం పెరగడం విశేషం. ఇదే సమయంలో నెట్ సేల్స్ కూడా 10 శాతానికిపైగా పెరిగింది. దీంతో ఈ స్టాక్ వరుసగా అప్పర్‌సర్క్యూట్లను కొడుతోంది. .












Click it and Unblock the Notifications