వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చదువులో డ్రాపౌట్స్.. కెరీర్‌లో టాపర్స్: ఇండియాలో వీళ్లే దూసుకెళ్తున్నారు..

కాలేజీ చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టి.. వ్యాపార రంగంలోకి దిగిన ఏడుగురి జాబితా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బుద్దిగా క్లాస్‌కు వెళ్లి.. ఎకడమిక్ చదువులతో కుస్తీ పడటం కొందరు విద్యార్థులకు అస్సలు గిట్టదు. చేతకాదేమో కూడా. చదువుపై అనాసక్తో.. ఇతరత్రా వ్యాపకమో.. పరిస్థితుల ప్రభావమో.. రొటీన్ కు భిన్నంగా వెళ్లాలన్న తాపత్రయమో.. వాళ్ల బుర్రలను నిత్యం తొలుస్తూనే ఉంటుంది.

ఎంత ప్రయత్నించినా.. క్లాస్ రూమ్ కు బుర్రలో ఆలోచనలకు సంధి కుదరదు. అలా.. బలవంతంగా కొద్దిరోజులు బండి లాగించినా.. మరికొన్ని రోజులు పోయేసరికి బండి మొరాయించడం మామూలే. ఇక అక్కడితో కాలేజీ కనెక్షన్ కట్..

కట్ చేస్తే.. డ్రాపౌట్స్ కాస్త కెరీర్ లో ఇలా పీక్స్‌కు చేరినవాళ్లున్నారు..

అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ:

అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ:


ముఖేష్ అంబానీ.. ఇప్పుడాయనకు అత్యంత ధనవంతుడు అనే ట్యాగ్ లైన్ ఉంది. కానీ ఆయనో కాలేజీ డ్రాపౌట్ అన్న సంగతి తెలుసా?. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేసిన ముఖేష్ తన తండ్రి వ్యాపార బాధ్యతల్లో భాగస్వామిగా మారాడు.

ప్రస్తుతం ముఖేష్ ఇండియాలో అత్యంత ధనవంతుడు, ఆసియాలోని అత్యంత ధనికుల్లో 2వ వాడు అన్న సంగతి తెలిసిందే. వరల్డ్ రిచెస్ట్ జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు.

ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్ జీ:

ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్ జీ:

విప్రో.. పేరుగాంచిన సాఫ్ట్ వేర్ కంపెనీ. ఆ కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న అజీం ప్రేమ్ జీ కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేశారు. 1996లో కాలిఫోర్నియాలో చదువుకుంటున్న సమయంలో అజీం తండ్రి హఠాన్మరణం చెందారు. దీంతో 21 ఏళ్ల వయసులో చదువును మధ్యలోనే ఆపేసి అజీం వ్యాపార రంగంలోకి దిగారు.

జీ మీడియా అధిపతి సుభాష్ చంద్ర:

జీ మీడియా అధిపతి సుభాష్ చంద్ర:

పదవ తరగతిలోనే చదువును ఆపేసిన సుభాష్ చంద్ర.. 'జీ' మీడియా అధిపతిగా అవతరించడం వెనుక ఆయన పడ్డ శ్రమ, కృషి దాగుంది. తొలుత ఫైడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బియ్యాన్ని సరఫరా చేసే కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించేందుకు కమిషన్ ఏజంట్ గా పనిచేశారు.

ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ జీ మీడియాను స్థాపించారు. గత సంవత్సరం నుంచి హర్యానా నుంచి రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు.

ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ:

ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ:

ఇండియాలోని అతిపెద్ద ఎగుమతి దిగుమతి సంస్థ అదానీ గ్రూప్ కు గౌతమ్ ఆదానీ చైర్మన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ ఆదానీ సైతం కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి డ్రాపౌట్ గా ఓ డైమండ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ రెండో సంవత్సరం చదవును మధ్యలోనే ముగించారు.

ముకేష్ జగిత్యాని:

ముకేష్ జగిత్యాని:

ల్యాండ్ మార్క్ గ్రూప్ వ్యవస్థాపకుడైన ముకేష్ జగిత్యాని లండన్ లోని ఓ బిజినెస్ స్కూల్ లో ఎకనమిక్స్ విద్య నుంచి డ్రాపౌట్ అయ్యారు. ఈ విద్యా సంస్థ దుబాయ్ లో ఉంది. అనంతరం వ్యాపార రంగంలోకి వచ్చిన ఆయన.. ఇండియా చైనా, పాకిస్థాన్, స్పెయిన్, గల్ఫ్ దేశాల్లో 600 స్టోర్లను స్థాపించారు.

పీఎన్సీ మీనన్:

పీఎన్సీ మీనన్:

ప్రముఖ నిర్మాణ సంస్థ శోభా డెవలపర్స్ యజమాని పుతన్ నెడువక్కట్ చెంతమారక్ష మీనన్ డిగ్రీని మధ్యలోనే ఆపేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆయన.. చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టి.. వ్యాపారంలోకి దిగారు. ఇప్పుడు కొన్నివేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.

వినోద్ గోయంకా:

వినోద్ గోయంకా:

స్వంతంగా వ్యాపారం చేయాలన్న తపన వినోద్ గోయాంకాను విద్య నుంచి డ్రాపౌట్ అయ్యేలా చేసింది. డీబీ రియాల్టీ సంస్థను ప్రారంభించి దాని ద్వారా విజయవంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

అయితే ఇండియాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన 2జీ కుంభకోణంలో వినోద్ గోయాంకా పేరు తెరపైకి రావడం ఆయన వ్యాపార కెరీర్ లో అడ్డంకిగా మారింది.

English summary
Here is the list of 7 successful entrepreneurs prove that college is not necessary for success
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X