డాక్టర్ కే లక్ష్మణ్‌కు కీలక పదవి?

Dr K Laxman: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ ప్రధానిగా ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది మూడోసారి.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ.

These leaders including K Laxman are among the front runners for the BJP president

ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా లభించింది 240 సీట్లు మాత్రమే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అండతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మేజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మాత్రమే అధికంగా లభించిన నేపథ్యంలో టీడీపీ- 16, జేడీయూ- 12 సీట్లు అత్యంత కీలకంగా మారాయి బీజేపీకి.

దీని ప్రభావం కేంద్ర మంత్రివర్గ కూటమిపై గట్టిగానే పడింది. మంత్రి పదవుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం నరేంద్ర మోదీకి ఏర్పడింది. 2014లో 45 మంది, 2019లో 57 మంది మంత్రులు ఆయన కేబినెట్‌లో పని చేయగా.. ఈ సారి సంఖ్యను ఏకంగా 72కు పెంచాల్సి వచ్చింది.

2014లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి అయిదు.. 2019లో మూడు కేబినెట్ బెర్తులిచ్చారు. ఇప్పుడీ సంఖ్యను ఏకంగా 11కు పెంచారు మోదీ. మొన్నటివరకు 23 మందికి కేబినెట్ హోదా ఇవ్వగా.. ఇప్పుడీ సంఖ్యను 30కి పెంచారు. సహాయమంత్రుల సంఖ్య కూడా గతంతో పోల్చుకుంటే రెండింతలైంది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేబినెట్‌లోకి తీసుకోవడం వల్ల ఆ స్థానం ఖాళీ కాబోతోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ పదవి ఎవరికి విరిస్తుందనేది ఆసక్తికరం. నిజానికి- జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే విషయం చివరి నిమిషం వరకూ తెలియదు. జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే ఉద్దేశంతోనే కేబినెట్‌లోకి తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది చర్చనీయాంశమౌతోంది. ఈ పదవి కోసం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేరు వినిపిస్తోంది. ఆయనకు సంఘ్ పరివార్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం ప్లస్ పాయింట్. మహారాష్ట్రకే చెందిన సీనియర్ నేత వినోద్ తావ్డే, తెలంగాణకు చెందిన ఓబీసీ నేత నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ, ఓపీ మాథుర్ పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+