లవ్ మ్యారేజ్: భర్తే వరుసకు సోదరుడయ్యాడు
అహమ్మదాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు అసలు విషయం తెలుసుకుని షాక్ కు గురైనారు. తన భర్త వరుసకు సోదరుడు అవుతాడని తెలుసుకున్న ఆమె ఇప్పుడు విడాకులు ఇప్పించి న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయించారు.
గుజరాత్ లో జరిగిన ఈ వింత సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అహమ్మదాబాద్ సమీపంలోని అంబవడి ప్రాంతంలో నివాసం ఉంటున్న నీతు, నితీశ్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే ఇద్దరికి 8 నెలల క్రితం ఒక పెళ్లిలో పరిచయం అయ్యింది. అప్పటి నుంచి వీరు నిత్యం కలుసుకుంటున్నారు.
వీరి స్నేహం ప్రేమకు దారితీసింది. నాలుగు నెలల క్రితం వేరే అబ్బాయితో నీతు వివాహం చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు నిశ్చయించారు. అయితే ప్రేమించిన వ్యక్తి దూరం అవుతాడని భయపడిన నీతు, నితీశ్ స్నేహితుల సమక్షంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

ఇద్దరూ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. అయితే ఇటివల నీతు, నితీశ్ కుటుంబ సభ్యులు ఒక పెళ్లిలో కలుసుకున్నారు. ఆ సందర్బంలో అక్కడ నీతు, నితీశ్ ఉన్నారు. నితీశ్ ను పిలిచి నీతు నీకు సోదరిఅవుతుందని కుటుంబ సభ్యులు పరిచయం చేశారు.
అంతే నీతు, నితీశ్ హడలిపోయారు. ఏమి చెయ్యాలో తెలియక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు షాక్ కు గురైనారు. నీతు, నితీశ్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత మహిళా పోలీస్ స్టేషన్ చేరుకుని అర్జీ సమర్పించారు.
ఈ నెల 18వ తేదిన ఇద్దరిని కుటుంబ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు చెప్పారు. నీతు, నితీశ్ ఇద్దరూ గతంలో ఎక్కడా కలవకపోవడం వలన ఈ పోరపాటు జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications