వర్క్ ఫ్రమ్ హోమ్, కంపెనీ షేర్లు, మలయాళం కుట్టికి ఏం చేశారంటే, అంతే కథ!
కొచ్చి/తిరువనంతపురం: భారతదేశంలో సైబర్ కేసులు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో మనం ఎవరితో మాట్లాడతామో ? ఏమి మాట్లాడతామో ? ఎవరిని నమ్ముతామో అనే విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి. గత చాలా నెలలుగా ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీకు ఆన్‌లైన్‌లో ఉద్యోగం ఇస్తామని, మీరు ఇంటి నుండి ఈ పనిని చేయవచ్చని చాలా మంది నుండి డబ్బును దోపిడీ చేస్తున్నారు.
ఇటీవల కేరళకు చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 7.74 లక్షల రూపాయలు ఆమె నుంచి లూటీ చేశారు. కేరళలోని పరవూరులోని కున్నుగరకు చెందిన మహిళ మోస పోయిందని పోలీసులు అన్నారు. యువతికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని ఓ నకిలీ కంపెనీ ఆమె నుంచి డబ్బులు వసూలు చేసింది.

జూన్ 11న యువతికి ఫోన్‌కు మందిరా శర్మ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. నీకు మా కంపెనీలో జాబ్ వచ్చింది అని చెప్పింది. వివిధ ఇంటర్నెట్ సేవలను రేట్ చేయడం మరియు సమీక్షించడం అతని రోజువారీ 'పని అని చెప్పింది. ఇది నమ్మకమైన కంపెనీ అని నమ్మిన యువతి తనకు నిజంగానే ఉద్యోగం వచ్చిందన్న ఆసక్తితో వాళ్లు చెప్పిన పని చేసింది. రోజుకో కొత్త టాస్క్‌లు ఇస్తూ వచ్చారు. మరికొద్ది రోజుల్లో మా కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు మొత్తం వస్తుందని ప్రచారం చేశారు.
అది మోసం అని తెలియక వారిని ఆమె పూర్తిగా నమ్మి రూ. 7.91 లక్షల రూపాయల పెట్టుబడికి ఒప్పుకుంది. మొదట్లో ఆమెకు రూ. 17 వేలు మాత్రమే లాభం వచ్చింది. అయితే కొద్ది రోజుల్లోనే కంపెనీ వెబ్‌సైట్ బ్లాక్ అయ్యింది. అప్పుడే తాను బాగా మోసపోయానని ఆమెకు అర్థమైంది. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మాత్రమే ఎర్నాకులం సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి 15 కేసులు నమోదయ్యాయి. ఈ మోసాలకు పాల్పడింది ఎవరు, వారు ఎక్కడ ఉన్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇటువంటి మోసాల నుండి సురక్షితంగా ఉండాలంటే మనం అనుసరించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా పాటించాలని పోలీసులు అంటున్నారు. మొదట మనం నమ్మకమైన వెబ్ సైట్ లలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం అని పోలీసులు అంటున్నారు. మీరు ఇతర మార్గాల ద్వారా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే, ఉద్యోగం గురించి ప్రచారం చేసిన వ్యక్తి మరియు కంపెనీకి సంబంధించిన వివరాలను సేకరించండి, తరువాత ముందుకు వెళ్లాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications