వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి వద్ద 7 వేల కోట్ల నగదు,నగదు మార్పిడి కోసం అన్వేషణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాయ్ పూర్ :పెద్ద నగదునోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే పెద్ద ఎత్తున నగదు ఉన్న మావోయిస్టులు ఏ రకంగా ఈ డబ్బును మార్చుకొంటారోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులు, పోస్టాపీసులపై దాడులు చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ తీసుకొన్న పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం సామాన్యులను ఇబ్బందిపెడుతోంటే అడవుల్లో ఉన్న మావోయిస్టులకు ఇంకా ఇబ్బంది తప్పదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నగదును మార్చుకొకుండా అడ్డుకొంటామని పోలీసులు చెబుతున్నారు.

they have 7000 crores of currency

మావోయిస్టుల కార్యకలాపాలు పెద్ద నగదు నోట్ల రద్దుతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పలు మార్గాల్లో సేకరించిన డబ్బును మార్పిడి చేసుకొనేందుకు మావోలు ప్రయత్నించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోల దగ్గర సుమారు 7 వేల కోట్ల రూపాయాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని బస్తర్ ప్రాంతంలోని అడవుల్లో దాచారని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు.

తమ వద్ద ఉన్న నగదును సానుభూతి పరుల సహాయంతో మార్పిడి చేసుకొనేందుకుగా మావోలు ప్రయత్నించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఇటీవలనే చత్తీస్ ఘడ్ లోని కొండగావ్ జిల్లాలో 44.24 లకష రూపాయాల నగదునుతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.మావోయిస్టులు డబ్బుల కోసం బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎటిఎం లపై దాడులు చేసే అవకాశమున్నందున జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

English summary
maoists excnange banned currency various methods suspect police. in bustar forest moists had a dump, in that dump around 7000 crores said police offecers. exchange banned currency from maoists sympathyesers said police.for strong security at atms banks, post offices for precaustions maoists attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X