వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: రెండున్నర ఏళ్ళుగా ఉద్యోగినిపై నలుగురు రేప్, వీడియో తీసి ఇలా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండున్నర ఏళ్ళుగా నలుగురు ఉద్యోగులు తనపై సహచర ఉద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.రెండున్నర ఏళ్ళుగా లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా వీడియో రికార్డు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

షాక్: పోలీస్ భార్యపై అత్యాచారం, బెయిల్‌ కోసం రూ. 5 లక్షలుషాక్: పోలీస్ భార్యపై అత్యాచారం, బెయిల్‌ కోసం రూ. 5 లక్షలు

మహిళలపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి.ఉద్యోగులపై సహచర ఉద్యోగులే లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

అయితే ఈ దారుణం దాదాపు రెండున్నర ఏళ్ళుగా కొనసాగుతోంది బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటనపై డిడిఏ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఇంకా మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదు.

షాక్: భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్‌రేప్, 3 రోజులపాటు నలుగురిలా..షాక్: భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్‌రేప్, 3 రోజులపాటు నలుగురిలా..

రెండున్నర ఏళ్ళుగా రేప్

రెండున్నర ఏళ్ళుగా రేప్

రెండున్నర ఏళ్ళుగా డిడిఏలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపుగా రెండున్నర ఏళ్ళుగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు.సీనియర్ అధికారి సహ మరో ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు ఆరోపించారు.

వీడియోలు తీసి బెదిరింపు

వీడియోలు తీసి బెదిరింపు

తనపై లైంగికంగా దాడి చేయడమే కాకుండా తనను హతమారుస్తామని కూడ నిందితులు బెదిరిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. అంతేకాదు తనపై అత్యాచారం చేసే సమయంలో వీడియోలు తీసి వాటిని బహిరంగపరుస్తామంటూ బ్లాయి మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

భర్త మరణించడంతో ఉద్యోగం

భర్త మరణించడంతో ఉద్యోగం

బాధిత మహిళకు 2014లో భర్త మరణించిన క్రమంలో డీడీఏలో ఉద్యోగం లభించింది.అయితే ఆమె ఉద్యోగం చేరిన కొంత కాలం తర్వాతి నుండి నలుగురు ఉద్యోగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణకు ఆదేశించిన డిడిఎ ఉన్నతాధికారులు

విచారణకు ఆదేశించిన డిడిఎ ఉన్నతాధికారులు

తనకు రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదని బాధితురాలు ఆవేదన చెందారు. తనకు జరిగిన అన్యాయాన్ని బాధిత ఉద్యోగిని సీనియర్‌ డీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.దీంతో శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించామని సీనియర్‌ డీడీఏ అధికారి వెల్లడించారు.మరో వైపు పోలీసులకు కూడ బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని డీసీపీ రొమిల్‌ బనియా చెప్పారు.

English summary
A woman working with the Delhi Development Authority (DDA) accused four employees, including a senior official, of the urban body, of sexually harassing her on several occasions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X