వీడి అసాద్యం గూల.. ట్రంప్ వేశంలో దొంగతానాకి వచ్చి దోచుకెళ్లాడు..! బిత్తరపోయిన పోలీసులు..!!
సిడ్నీ: కొందరు ఏ పని చేసినా వైవిద్యాన్ని కోరుకుని తొందరగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్ర్యయ పడుతుంటారు. అదే కోవలో దొంగలు కూడా ఆలోచిస్తే కొంపకొల్లేరు కాక తప్పదేమో.. కొంప కోల్లేరుతో పాటు ప్రపంచ ప్రథమ పౌరుడుకే ఎసరు పెట్టాడు ఓ ప్రభుద్దుడు. ఆస్ట్రేలియాలోని ఓ దొంగ కాస్త వినూత్నంగా ఆలోచించాడు. సీసీ కెమెరాల్లో అతని ముఖాన్ని గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్క్‌నే ధరించి దొంగతనానికి పాల్పడ్డాడు. ట్రంప్ వేషధారణలో ఓ షాపులో దర్జాగా ప్రవేశించి తన పని తాను ఎంచక్కా పూర్తి చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఆస్ట్రేలియాలోని స్టార్త్‌పైన్ నగరంలో ఒక దొంగ ట్రంప్ మాస్క్‌ను పెట్టుకొని ఓ జ్యుయెలరీ షాపులో చోరికీ పాల్పడ్డాడు. అదే వేషధారణలో ఓ ఎలక్ర్టానిక్ దుకాణంలో కూడా దొంగతనం చేసి పలు వస్తువులను దొంగతనం చేశాడు. ఆ దొంగ ఆరోజు ట్రంప్ మాస్క్‌తో పాటు బ్లాక్ నైక్ జంపర్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్, వైట్ షూ ధరించి ఉన్నాడు. అయితే ఆ దొంగ ఎవరో కనిపెట్టడం ఇప్పుడు పోలీసులకు కష్టంగా మారింది. అతడిని ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారమివ్వాలని ఆస్ట్రేలియా పోలీసులు కోరుతున్నారు. సీసీటీవీల్లో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications