ట్రాఫిక్ లో చిక్కుకున్న సోదరి, రాఖీ కట్టడానికి రాలేదని సోదరుడి ఆత్మహత్య !

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆగ్రా: తన సోదరి రాఖీ కట్టడానికి రాలేదని జీవితంపై విరక్తి చెందిన అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో ని ఆగ్రా నగరంలో జరిగింది. ఆగ్రాలోని రామ్ బాఫ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సోను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

సోనుకు భావన అనే సోదరి ఉంది. సోను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాఖీ పండగ సందర్బంగా తన ఇంటికి రావాలని సోను తన సోదరి భావనకు చెప్పాడు. భావనకూడా తాను వచ్చి రాఖీ కడుతానని అన్న సోనుకు చెప్పింది.

Thinking his sister was upset, brother hangs himself in Agra

రాత్రి వరకు భావన కోసం ఎదురు చూసిన సోను చివరికి తన సోదరి రాలేదని జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటికే సోదరుడి ఇంటికి బయలుదేరిన భావన ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. చివరికి చేతిలో రాఖీ పట్టుకుని ఇంటికి చేరుకున్న భావన తన సోదరుడు సోను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man hanged himself here thinking his sister will not meet him on Rakshabandhan because of a row they had two months ago. Disappointed that his sister had not come, he killed himself, police said. By the time his sister, Bhavna, reached his house with a Rakhi, it was too late.
Please Wait while comments are loading...