కేరళలో మంకీపాక్స్ కలకలం: మూడో కేసు నమోదు, యూఏఈ నుంచి వ్యక్తి

తిరువనంతపురం: కేరళలో క్రమంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. యూఏఈ నుంచి కేరళకు తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి శుక్రవారం మంకీపాక్స్ నిర్ధరణ అయ్యింది. ఆ వ్యక్తి జూలై 6న యూఏఈ నుంచి మల్లాపురం వచ్చాడు. దీంతో భారతదేశంలో నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఈ మూడు కేసులు కూడా ఒక్క కేరళ రాష్ట్రంలోనే వెలుగుచూడటం గమనార్హం.

కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. "జులై 6న యూఏఈ నుంచి 35 ఏళ్ల వ్యక్తి మల్లాపురం తిరిగి వచ్చాడు. జూలై 13న జ్వరంతో మంజేర్రీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఆ తర్వాత జూలై 15 నుంచి అతను మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది అని చెప్పారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం అతడికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇదిలావుండగా, రోగి కుటుంబం, సన్నిహితులను పరిశీలనలో ఉంచినట్లు కేరళ ఆరోగ్య మంత్రి తెలిపారు.

Third Monkeypox Case Confirmed In Kerala: the Man Had Returned From UAE

జూలై 13న దుబాయ్ నుంచి కేరళలోని కన్నూర్‌కు చేరుకున్న 31 ఏళ్ల వ్యక్తికి ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జూలై 18న, భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నిర్ధారించబడింది.

జులై 14న భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ కేసు కేరళలో కూడా బయటపడింది. ఇక్కడ యూఏఈ నుంచి తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కనుగొనబడింది.

ఆరోగ్య చర్యలను అమలు చేయడం, వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్రం పంపిన బహుళ-క్రమశిక్షణా బృందంతో కేరళ ఇప్పటికే కలిసి పనిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+