సొంత కారు తయారు చేసిన డ్రైవర్ కొడుకు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన పందొమ్మిదేళ్ల యువకుడు సొంతగా కారు తయారు చేశారు. అతను యూ ట్యూబ్‌లో నేర్చుకొని దీనిని తయారు చేశాడు. అతని పేరు ప్రేమ్ ఠాకూర్. యూ ట్యూబ్‌లో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే వీడియోలను చూసి నేర్చుకున్నాడు.
ప్రేమ్ ఠాకూర్ మధ్య తరగతి వ్యక్తి. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో అనుభవం లేదు. కార్ల తయారీ గురించి అతనికి ఎవరూ చెప్పలేదు. శిక్షణ తీసుకోలేదు. కానీ సొంతంగా ఒక బగ్గీ కారుని తయారు చేసి ఇప్పుడు చర్చనీయాంగా మారాడు. ఇతను ప్రస్తుతం బీ.కాం చదువుతున్నాడు.

ఇతనికి చిన్నతనం నుంచే కార్లపై ఆసక్తి. స్పోర్ట్స్ కార్లంటే మరీ ఆసక్తి. ఆ ఆసక్తి ఇప్పుడు అతనికి కార్లను తయారు చేసే ఆలోచనను కలిగించింది. దానికి తగ్గట్టే ప్రస్తుతం ఒక బగ్గీ కారును తయారు చేశాడు. పాత సామాన్లతో ఆ కారుని తయారు చేసి స్వయంగా దానికి రంగులు అద్దాడు.
దానిని నడుపుతూ వీధుల్లో, పెట్రోలు బంకుల్లో వెళ్తుంటే అందరూ దానిని చూడటానికి ఎగబడుతున్నారు. ఇతనికి 12వ ఏటనే తండ్రి కంప్యూటర్ కొనిచ్చాడు. అప్పట్నుంచీ ఇంటర్నెట్లో కార్ల పైనే ఎక్కువ కాలక్షేపం చేసేవాడు. యూట్యూబ్‌లోని డూ ఇట్ యువర్ సెల్ఫ్ లో కార్ల తయారీ వీడియోలనే చూసేవాడు. తండ్రి ఆటో డ్రైవర్.
చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ కొడుకు ఆసక్తికి అడ్డు చెప్పలేదు. ఉన్నంతలో ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. దానికి మొత్తం రెండున్నల లక్షల వరకు ఖర్చు అయింది. ఈ బగ్గీ తయారు చేయడానికి రెండు కారణాలున్నాయని, ఒకటి ఇంటర్నెట్, రెండు తన బామ్మ సహా ఇంట్లో వాళ్లు తనకు సహకరించడమని చెప్పాడు. భవిష్యత్తులో మరింత వినూత్నమైన కార్లు సృష్టించాలనేది కోరిక అన్నాడు.












Click it and Unblock the Notifications