వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ యాప్: ఈ యాప్ ద్వారా రైలు టికెట్లు కన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు

|
Google Oneindia TeluguNews

మీరు రైల్లో ప్రయాణించిందేందుకు టికెట్ బుక్ చేసుకున్నారా...? టికెట్ కన్ఫామ్ కాలేదా...? టికెట్ కన్ఫామ్ అవుతుందో లేదో అనే టెన్షన్ పడుతున్నారా..? అయితే ఇకపై అలాంటి టెన్షన్‌లేవీ లేకుండా మీ జర్నీని ఒక చిన్న యాప్‌తో ప్లాన్ చేసుకోండి. సాధారణంగా 120 రోజుల ముందే ఒక జర్నీ కోసం ట్రైన్స్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే నాలుగు నెలల ముందే మన జర్నీని ప్లాన్ చేయడం చాలామటుకు కుదరదు కనుక రైల్ యాత్రి అనే యాప్‌ ద్వారా ఫలనా ప్లేస్‌కు వెళ్లేందుకు టికెట్లు ఎన్ని రోజుల ముందు, ఎన్ని గంటల ముందు బుక్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు.

లోతైన సమాచారం, విశ్లేషణతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో రైల్ యాత్రి యాప్ పసిగడుతుంది. అంటే టికెట్లు ఎంత త్వరగా అమ్ముడుపోతాయో ఈ యాప్ తెలుపుతుంది. అప్పుడు మీరు ఇంకెంత జాగ్రత్త పడాలో అర్థమవుతుంది. కొన్ని రైళ్లకు బుకింగ్ ఓపెన్ అయినప్పటికీ కూడా టికెట్లు అమ్ముడుపోవు.. మరికొన్ని రైళ్లలో మాత్రం బుకింగ్ ఓపెన్ అయిన 5 గంటల్లోపే టికెట్లు అమ్ముడుపోతాయి. గంటకు 51 టికెట్లు చొప్పున వేగంగా అమ్ముడుపోయే దాఖలాలు కూడా ఉన్నాయి. మరోవైపు బుక్కింగ్ ఓపెన్ అయినప రెండు వారాల్లోపే 50శాతం రైళ్లలో పూర్తిస్థాయిలో టికెట్లను ప్రయాణికులు కొనుగోలు చేసిఉంటారు. ఒక ట్రావెల్ కంపెనీ చేసిన సర్వే ప్రకారం రోజు ఒక 10 లక్షల మంది ప్రయాణికులకు కన్ఫామ్ టికెట్ దొరకదట.

This app will predict your ticket confirmation

రైల్ యాత్రి యాప్‌లో రష్-ఓ-మీటర్ అనే ఫీచర్ ఎప్పటిలోగా లేదా ఎన్ని గంటల సమయంలోగా బుక్ చేస్తే టికెట్ కన్ఫామ్ అవుతుందో చెప్పేస్తుందని రైల్ యాత్రి సహవ్యవస్థాపకుడు, సీఈఓ మనీష్ రాఠీ చెబుతున్నారు. చాలామంది టికెట్ బుకింగ్ పై చాలా మాటలు చెబుతుంటారని... అయితే రైల్ యాత్రి యాప్ మాత్రమే ఏ సమయంలోగా టికెట్ బుక్ చేస్తే కన్ఫామ్ అవుతుందో కచ్చితంగా చెప్పేస్తుందని మనీష్ వివరించారు. ఇది ప్రయాణికులకు ఒక అలారంలాగా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాదు RACలో ఉన్న టికెట్ వెయిటింగ్ లిస్టులోకి ఎప్పుడు మారుతుంది అని కూడా యాప్ చూపిస్తుందట.

రైల్ యాత్రి యాప్ ప్రకారం త్వరగా సీట్లు నిండిపోయే రైళ్లు ఇవేనట. ఇండోర్-జోధ్‌పూర్ రంతంబోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, హౌరా-పూరీ శ్రీ జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్, న్యూ జల్పాయ్‌గురి-న్యూఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్,వారణాసి ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లలో టికెట్లు తొందరగా అమ్ముడుపోతాయట. బుకింగ్ ఓపెన్ అయిన 15 రోజులకు కూడా కొన్ని రైళ్లలో టికెట్లు అమ్ముడుపోవట. అవి తూత్తుకుడి-మైసూర్ ఎక్స్‌ప్రెస్,ఇండోర్-పూణే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, లింగంపల్లి-కాకినాడ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్,కోల్‌కత్తా-ఉదయ్‌పూర్ అనన్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.

ఇంకే ముంది..రైల్ యాత్రి యాప్‌ను వెంటనే మీ ఫోన్‌లో ఇన్స్‌టాల్ చేసుకుని మీరు వెళ్లాల్సిన ప్రాంతానికి రైళ్ల టికెట్లు ఎప్పుడు అమ్ముడుపోతాయో తెలుసుకుని దీని ఆధారంగా మీ జర్నీని ఎంచక్కా ప్లాన్ చేసుకోండి.

English summary
Getting a confirmed train ticket for your holiday or work trip can be tricky, particularly during peak season or at congested routes, but a mobile app now predicts when is a good time for passengers to get confirmed train tickets.The RailYatri app tells you how many hours/days you have to book your tickets before they get sold out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X