'అమ్మా కా దివాళీ. హ్యాపీ బనావో': కంటతడి పెట్టిస్తున్న 'హెచ్‌పీ' దీపావళి వీడియో, మనమూ ఇలా చేద్దాం!

న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చడం, మిఠాయి తినడంతో పాటు వెలుగులు జిలుగులు గుర్తుకు వస్తాయి. దీపావళి పర్వదినం నుంచి కార్తీక పౌర్ణమి వరకు అందరూ తమ తమ ఇళ్ల ముందు ప్రమిదలు పెడతారు. ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పుట్టుకు వచ్చాయి. దీంతో చాలామంది వాటిల్లో కొనుగోలు చేస్తున్నారు.

హెచ్‌పీ ఇండియా అద్భుత వీడియో

హెచ్‌పీ ఇండియా అద్భుత వీడియో

కానీ దీపావళి పండుగ సందర్భంగా సాధారణ కుమ్మరులు లేదా సాధారణ వ్యాపారుల జీవితాల్లో అందరం వెలుగులు, ఆనందాలు నింపుదామని చెబుతూ హెచ్‌పీ ఇండియా ఓ అద్భుతమైన వీడియోను రూపొందించింది. ఈ వీడియో మూడు నిమిషాలకు పైగా ఉంది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

హెచ్‌పీ ఇండియా అప్ లోడ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. తొమ్మిదేళ్ల బాలుడు వీధుల్లో ప్రమిదలు అమ్ముకునే ఓ మహిళ ముఖంలో ఆనందం తీసుకు వచ్చాడని, ఇందుకు సంబంధించిన వీడియోను పూర్తిగా చూడమంటూ హెచ్‌పీ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్‌లో 'ఉమ్మీద్ కా దియా' పేరిట 33 సెకన్ల వీడియోను పెట్టి, పూర్తి వీడియోకు అక్కడ లింక్ ఇచ్చింది. ఈ వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కంటతడి పెట్టిస్తోంది.

వారికి వెలుగునిద్దాం

వారికి వెలుగునిద్దాం

మనం వేసే ఒక్క అడుగు ఎందరి జీవితాలలోను మార్పును తీసుకు వస్తుందని, దీపావళి పండుగకు కావాల్సిన వస్తువులను వీధుల్లో అమ్మేవారి నుంచి కొనుగోలు చేయాలని, తద్వారా వారికి అండగా నిలబడుదామని, వీధుల్లో అమ్మేవారి నుంచి ప్రమిదలు కొనుగోలు చేసి మన ఇంట్లో వెలిగించే దీపాలు, వారి నివాసాల్లోను వెలుగును ఇస్తాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

'అమ్మా కా దివాళీ. హ్యాపీ బనావో'

ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ వీధిలో ప్రమిదలు పెట్టుకొని అమ్మడం కోసం కూర్చుంటుంది. అటు నుంచి చాలామంది వెళ్తారు. ఆమె వద్ద మాత్రం కొనేందుకు ఆసక్తి చూపించరు. ఓ బాలుడు తన తల్లితో దీపావళి షాపింగ్ కోసం వెళ్తాడు. అక్కడ వీధిలో ప్రమిదలు అమ్ముతున్న మహిళను చూసి ఫోటో తీస్తాడు. అమ్మా ఇవి కొందామని ప్రమిదలను చూపిస్తాడు. కానీ ఆ తల్లి వద్దని చెప్పి తీసుకు వెళ్తుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి తల్లితో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయి, కాసేపటి తర్వాత డబ్బులతో తిరిగి వచ్చి ఆ మహిళ వద్ద ప్రమిదలు కొంటాడు. హ్యాపీ దీపావళి అని ఆ మహిళకు చెబుతాడు. ఆమె ఈ ప్రమిదలు అన్నీ అమ్ముడుపోతేనే తనకు సంతోషమని చెబుతుంది. ఆ తర్వాత బాలుడు ఇంటికి వెళ్లి 'అమ్మా కా దివాళీ. హ్యాపీ బనావో' అంటూ ప్రింటవుట్‌లు తీసు అంతటా అతికిస్తాడు. ఎందరికో పంచుతాడు. అలా ఆ అమ్మ వద్ద ప్రమిదలు అమ్ముడుపోతాయి. ఆమెలో ఆనందం కనిపిస్తుంది. హెచ్‌పీ ఇండియా రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. మీరు ఇలా చేయమంటూ మనకు చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+