వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంజి కారు: ఫ్యాన్సీ నెంబర్ విలువ రూ. 8.5 లక్షలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్ద 'సోనాలికా' ఛైర్మన్ ఎల్‌డీ మిట్టల్ కొత్త కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ. 8.5 లక్షలు చెల్లించారు. చండీగఢ్‌‌లో సీహెచ్ 01 ఏజెడ్ సిరిస్‌లో 0001 నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ (ఆర్‌ఎల్‌ఏ) అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.

ఈ వేలంలో పాల్గోన్న సోనాలికా గ్రూప్‌కు చెందిన నూతన 'మెర్సిడిస్ ఎస్' క్లాస్ కారు కోసమని ఈ నెంబర్ కొనుగోలు చేశామని ఆ సంస్ద అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, 2013లో సీహెచ్ 01 ఏటీ సిరిస్‌లో 0001 నెంబర్ కోసం వేలం నిర్వహించగా, ఓ వ్యక్తి ఆ నెంబర్‌ను రూ. 9.1 లక్షలకు దక్కించుకున్నారని ఆర్ఎల్ఏ అధికారులు తెలిపారు. చండీగఢ్ ఆర్‌ఎల్‌ఏ ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఇదే అత్యధిక మొత్తం అన్నారు.

This Industrialist Paid Rs. 8.5 Lakh for a Number Plate

ఈ ఏడాది మార్చిలో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో తొలిసారి మిట్టల్ స్దానం సంపాదించారు. ఆయన నికర ఆస్తి విలువ $ 1.1 బిలియన్లు. 40 సంవత్సరాల పనిచేసిన అనుభవం గడించిన మిట్టల్ భూమిపై అత్యంత ధనిక ప్రజల జాబితాలో 1,465 ర్యాంకులో ఉన్నారు.

1969లో ప్రారంభమైన సోనాలికా గ్రూపు ట్రాక్టర్లను తయారు చేయడంలో ఇండియాలో మూడవ స్దానంలో ఉంది. వీటితో పాటు మల్టీ యుటిలిటీ వాహనాలు, వ్యవసాయ యంత్రాలు , డీజిల్ జేన్సిట్లు, ఆటో భాగాలు తయారు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సోనాలికా ఉత్పత్తులు 60 దేశాలకు పైగా అమ్ముడవుతున్నాయి.

English summary
Industrialist LD Mittal who is the chairman of Sonalika Group has paid Rs. 8.5 lakh for a fancy number plate in a public auction. The 0001 number of the newly launched CH-01-AZ series was auctioned at the Registering and Licensing Authority (RLA) office in Chandigarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X