అటాకింగ్‌లో నెంబర్ వన్: అపాచీ ఏహెచ్ హెలికాఫ్టర్ విశిష్టతలు ఏంటి..?

పంజాబ్ : దాయాది దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన బలోపేతం దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని బోయింగ్ సంస్థ నుంచి తయారైన అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లను కొనుగోలు చేసింది. మొత్తం 22 చాపర్లను ఆర్డర్ ఇవ్వగా ఇందులో 8 చాపర్లు భారత వాయుసేనలో చేరాయి. ఇందుకు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ వేదికగా నిలిచింది.

ఎలాంటి వాతావరణంలోనైనా సత్తా చాటే అపాచీ చాపర్లు

ఎలాంటి వాతావరణంలోనైనా సత్తా చాటే అపాచీ చాపర్లు

పాకిస్తాన్ నుంచి యుద్ధం వచ్చే ముప్పు ఉండటంతో ఈ అడ్వాన్స్‌డ్ హెలికాఫ్టర్ అపాచీ ఏహెచ్-64 ను రెండు స్క్వాడ్రన్‌లుగా విభజించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఒకటి పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో ఉండగా మరొకటి పంజాబ్‌లో ఉంచారు. ఇక ఈ హెలికాఫ్టర్ల చేరికతో జోర్హాత్, అస్సాం, సరిహద్దుల్లో కూడా గస్తీకి పనికొస్తాయి. ఎందుకంటే ఇక్కడ చైనా నుంచి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఈ చాపర్ల పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే... ఎలాంటి వాతావరణంలోనైనా ఇవి లక్ష్యాలను చేధించగలవు. అంతేకాదు శతృవులకు దొరక్కుండా తక్కువ ఎత్తులోనే ఎగురుతూ లక్ష్యాలను చేధించగలిగే సామర్థ్యం అపాచీ ఏహెచ్-64ఈ చాపర్లకు ఉంది. అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడంతో మరింత బలోపేతం అయ్యింది.

ఎగిరే యుద్ధ ట్యాంకుగా పిలువబడే అపాచీ చాపర్

ఎగిరే యుద్ధ ట్యాంకుగా పిలువబడే అపాచీ చాపర్

ఇక అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లు ప్రపంచంలోని అత్యాధునిక హెలికాఫ్టర్లలో తొలిస్థానంలో నిలిచాయి. అమెరికా సైన్యం ఈ హెలికాఫ్టర్లను వినియోగిస్తోంది. సెప్టెంబర్ 2015లో భారత ప్రభుత్వం అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లకు బోయింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 22 చాపర్లకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పుడు 8 చాపర్లు డెలివరీ అయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై 27న ముందుగా నాలుగు చాపర్లను హిందాన్ ఎయిర్‌బేస్ వద్ద బోయింగ్ సంస్థ అప్పగించింది. అపాచీ ఏహెచ్-64ఈని పరిశీలిస్తే ఇది ఎగిరే యుద్ధ ట్యాంకు అని పిలవొచ్చు. భీకరమైన దాడులను కూడా తట్టుకొనగలిగే శక్తి ఈ చాపర్ల సొంతం. అపాచీ హెలికాఫ్టర్‌లో అత్యాధునికమైన సాంకేతిక వ్యవస్థ ఉంది. ఈ చాపర్లకు సమగ్రంగా ఉండే డిజిటల్ కాక్‌పిట్ ఉంది. ఇక రెండు టర్బో షాఫ్ట్ ఇంజిన్‌లు కలిగి ఉన్న ఈ చాపర్ గంటకు 284 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

 గల్ఫ్ యుద్ధాల్లో అపాచీ హెలికాఫ్టర్ల పాత్ర

గల్ఫ్ యుద్ధాల్లో అపాచీ హెలికాఫ్టర్ల పాత్ర

అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాఫ్టర్‌ను చాలా హాలీవుడ్ సినిమాల్లో వినియోగించారు. తొలిసారిగా ఇది గల్ఫ్ యుద్ధంలో సత్తా చాటింది.1990లో కువైట్‌పై ఇరాక్ దండయాత్ర చేసిన సమయంలో అమెరికా ప్రభుత్వం ఆదేశంలో ఉన్న సగానికి పైగా అపాచీ ఏహెచ్-64ఈ చాపర్లు సౌదీ అరేబియాలో మోహరించాయి. ఒక్క చాపర్ మినహా అన్ని హెలికాఫ్టర్లు వాటి సత్తాను చాటాయి. ఇదిలా ఉంటే అపాచీ ఏహెచ్-64ఈ చాపర్ తొలిసారిగా 1975లో ఎగిరింది. ముందుగా ఒక చెట్టు ఎత్తున్న ఎత్తులో ఎగిరేలా రూపొందించారు. అప్పట్లో సోవియట్ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించేందుకు డిజైన్ చేశారు. ఇక ప్రాథమికంగా ఈ చాపర్లలో హెల్‌ఫైర్, యాంటీ ట్యాంక్ మిసైల్ వ్యవస్థ కలిగి ఉన్నాయి. ఇవి దాదాపు 16 క్షిపణులను మోసుకెళ్లగలవు.

అపాచీ ఏహెచ్-64ఈ స్పెసిఫికేషన్స్

అపాచీ ఏహెచ్-64ఈ స్పెసిఫికేషన్స్

ఏహెచ్ -64ఈ అపాచీ హెలికాఫ్టర్‌లో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఒకరు పైలట్ కాగా మరొకరు గన్నర్‌లు ఉంటారు. పైలట్ ముందు సీటులో కూర్చుంటే... గన్నర్ వెనక సీట్లో కూర్చుంటాడు. ఇతని చేతిలోనే ఆయుధాల నియంత్రణ ఉంటుంది.భూమిపై ఆకాశంలో లక్ష్యాలన వెనక సీటులో కూర్చున్న గన్నర్ సమన్వయంలో ఉంటుండగా... పైలట్ వీటిని టార్గెట్ చేసి పేలుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+