ట్రంప్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన భారత్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమాయకులు చనిపోతున్నప్పటికీ, భారత్ చౌకగా ఇంధనం కొనుగోలు చేస్తూ రష్యాకు ఆర్థిక సహాయం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ చమురు కొనుగోలు చేయడమే రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి కారణమని, యుద్ధం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పటికే భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్, తాజాగా మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. ట్రంప్ భారత్‌పై ప్రకటించిన మరో 25 శాతం అదనపు సుంకాలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది అన్యాయమైన, అనైతికమైన, అసమంజసమైన చర్య అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది.

ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు దిగుమతులను లక్ష్యంగా చేసుకుందని ఆ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 1న విధించిన 25 శాతం అదనపు సుంకాలతో కలిపి ఇప్పుడు మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను వెంటనే నిలిపివేయాలని ట్రంప్ భారత్‌కు అల్టిమేటం జారీ చేశారు. ట్రంప్ ఈ తీరుపై రష్యా కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది.












Click it and Unblock the Notifications