Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కౌన్ బనేగా కరోడ్ పతి షో: PNR అంటే ఏమిటో చెప్పలేకపోయిన రైల్వే టీటీఈ

Recommended Video

    కౌన్‌బనేగా కరోడ్ పతి సీజన్ 10 లో షాకింగ్ సంఘటన

    బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్ పతి సీజన్ 10 ప్రారంభమైంది. రెండో ఎపిసోడ్‌లో భాగంగా హాట్‌సీట్‌లో బీహార్‌కు చెందిన సోమేష్ అనే వ్యక్తి కూర్చున్నాడు. సోమేష్‌ రైల్వేలో టికెట్ ఎగ్జామినర్‌గా పని చేస్తున్నారు. ఇక ఆట మొదలైంది. అమితాబ్ బచ్చన్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. సోమేష్ టకటకా జవాబు చెబుతున్నాడు.

    అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ వస్తున్న సోమేష్ ఒక్క ప్రశ్న దగ్గర టక్కున ఆగిపోయాడు. అప్పటి వరకు ఆయన గెలుచుకున్న డబ్బులు మొత్తం రూ.3,20,000. ఇక ఇంత డబ్బును గెలుచుకునేందుకు నాలుగు లైఫ్‌లైన్లలో మూడు లైఫ్ లైన్లు వినియోగించుకున్నాడు సోమేష్. అయితే ఇక్కడ అమితాబ్ అడిగిన ప్రశ్నకు సోమేష్ బిక్కమొహం వేశాడు. పోనీ ప్రశ్న కూడా ఎక్కడి నుంచో వెతికి వేయలేదు. సోమేష్ పనిచేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నే అమితాబ్ వేశారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే... రైల్వేలో పీఎన్ఆర్ కు పూర్తి రూపం ఏమిటి..?

    This Railway TTE could not answer the full form of PNR number in KBC

    PNR (passenger name record)కు పూర్తి రూపం ఏమిటి అడగ్గానే సోమేష్ చాలా ఆలోచించాడు. రైల్వేలో టీటీఈగా పనిచేస్తున్న సోమేష్‌కు జవాబు తెలియకపోవడంతో అక్కడ కూర్చున్న వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు ఆడియెన్స్ పోల్ లైఫ్ లైన్ వినియోగించుకున్నాడు సోమేష్. రైల్వేలో పనిచేస్తున్న సోమేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం నిజంగా ఆశ్చర్యమే. అదికూడా టీటీఈ జాబ్ చేస్తున్న ఆయన పీఎన్ఆర్ నెంబర్‌ అంటే తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యమే అంటూ నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ఇక సోమేష్‌కు అరటి పండ్లు ఎక్కువగా ఇష్టమట. దీంతో అమితాబ్ బచ్చన్ ఆయన కోసం అరటి పండ్లు కూడా సెట్‌లోకి తెప్పించారు. తనకు అరటి పండ్లు అంటే ఎందుకంత ఇష్టమో ఒక చిన్న కథలా చెప్పి అందరిని నవ్వించాడు సోమేష్.

    ఇక అతని ఉద్యోగం గురించి మాట్లాడుతూ తన జాబ్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందన్నాడు. కొన్ని సార్లు ప్రయాణికులు తనకు ఎంతో గౌరవం ఇస్తారని మరికొన్ని సార్లు అసలు పట్టించుకోరని చెప్పాడు సోమేష్. ఇక బాలీవుడ్ సినిమా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గురించి మరో ప్రశ్న సంధించారు. సమాధానం చెప్పాక తన జీవితంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తుచేసుకున్నాడు సోమేష్. తాను ఒక అమ్మాయిని ఇష్టపడినట్లు చెప్పిన సోమేష్... ప్రస్తుతం ఆమె మరొకరికి ఫుల్ వైఫ్ అయ్యిందని చెప్పి సెట్‌లో నవ్వులు పూయించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+