ఇంతవరకూ! నెగ్గినోడే లేడు: ఢిల్లీ హోటల్ ఛాలెంజ్.. ఆ మూడు పరోటాలు తింటే

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మీరు భోజన ప్రియులా?.. ఆవురావురుమంటూ ఆరగించే అలవాటుందా?.. అయితే ఢిల్లీలోని ఓ పరోటా హోటల్ మీకు ఆహ్వానం పలుకుతోంది. వాళ్లు విసిరే ఛాలెంజ్‌లో గనుక మీరు నెగ్గితే.. జీవితాంతం ఉచితంగా వాళ్లే తిండి పెడుతారట.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఢిల్లీ-రోహ్‌తక్‌ బైపాస్‌ రోడ్డులో పరాటా జంక్షన్ అనే ఓ హోటల్ ఉంది. ఈ హోటల్ యజమాని గత కొన్నాళ్లుగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. తమ హోటల్లో తయారుచేసే మూడు పరోటాలను 50ని.ల్లోగా ఆరగించాలి. అలా చేస్తే జీవితాంతం ఉచితంగా తిండి పెడుతానంటున్నాడు.

 This Restaurant Will Give You Free Food For Life If You Finish Three Parathas Within 50 Minutes

ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆ మూడు పరోటాల డబ్బులు కట్టాల్సిందే. అబ్బే.. పరోటాలు తినలేమా!.. అని తేలిగ్గా తీసిపారేయకండి. అవి మామూలు పరోటాలు కాదు. ఒక్కోటి కిలో బరువుతో.. ఒక అడుగు, 6 అంగుళాల పరిణామంలో ఉంటాయి. ఇలాంటివి మూడు పరోటాలను 50నిమిషాల్లో ఆరగించాలి.

ఇప్పటికైతే ఈ ఛాలెంజ్‌లో ఎవరూ నెగ్గలేదు. ప్రతీరోజు చాలామందే ప్రయత్నిస్తారు గానీ ఇంతవరకు ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. ఈ హోటల్ ఛాలెంజ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోటల్ ముందు 'హిందుస్థాన్‌ కా సబ్‌ సే బడా పరోటా' అని రాసి పెట్టి ఉండటం విశేషం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Parathas! The name itself feels like magic to us. And what’s just great is that there’s such a vivid variety of parathas on offer – from muli ke paratha and alu paratha to kothu paratha and paneer paratha

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి