వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో రేప్ చేసి, ఇండియాను తిట్టాడు

|
Google Oneindia TeluguNews

కాన్ బెర్రా : అత్యాచారం చేసింది పోయి.. చేసిన నేరాన్ని సమర్థించుకునేందుకు దేశీయ సంస్కృతిని అప్రతిష్ట పాలు చేసే పనిచేశాడు సిమర్ దీప్ సింగ్ అనే ఓ క్యాబ్ డ్రైవర్. పరాయి దేశంలో ఉద్యోగానికని వెళ్లి.. అక్కడ వెలగబెట్టిన ఘనకార్యం చాలక భారతీయ సంస్కృతిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

పంజాబ్ లో పుట్టి పెరిగిన సిమర్ దీప్ సింగ్(31).. 2008లో ఆస్ట్రేలియాకు వెళ్లి క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో 2011లో ఓ 20 ఏళ్ల యువతి తన క్యాబ్ లో ఎక్కిన సందర్బంలో.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వైవాహిక జీవితం గురించి అనుచిత ప్రశ్నలు వేస్తూ.. ఆమె శరీర భాగాలను తాకుతూ తీవ్ర ఇబ్బందికి గురిచేశాడు. నార్త్ బ్రిడ్జి సమీపంలో క్యాబ్ ఎక్కిన సదరు ప్యాసింజర్.. క్యాబ్ దిగగానే విషయాన్ని తమ కంపెనీ ద్రుష్టికి తీసుకెళ్లింది.

This Sikh cab driver blamed his ‘Indian upbringing’

సదరు ప్యాసింజర్ దింపేసిన తర్వాత మరో 18ఏళ్ల యువతిని తన క్యాబ్ లో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఓ పార్క్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో సింగ్ కేసు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం మరుసటి రోజే పెట్టె బేడా సర్దుకుని ఇండియా వచ్చేశాడు.

ఈ నేపథ్యంలో 2015లో సింగ్ కు ఆస్ట్రేలియా కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. దీంతో సింగ్ తరుపు డిఫెన్స్ లాయర్ షనె కోర్టులో వాదించారు. 'ఇండియాలో పొట్టి ధరించే మహిళలను వ్యభిచారులుగా చూస్తారని, సింగ్ ఓ సాంప్రదాయ కుటుంబంలో పుట్టినందువల్ల సెక్స్ విషయాలపై బహిరంగంగా మాట్లాడుకోరని వాదించారు. టీవీల్లోను సెక్స్ కు సంబంధించిన చర్చలు ఉండవని, చిన్నవయసులో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించే పరిస్థితి ఇండియాలో లేదని ఆ కారణంగానే కల్చరల్ షాక్ గురైన అతను ఈ చర్యకు పాల్పడ్డాడని' డిఫెన్స్ లాయర్ తన వాదనలు వినిపించారు.

సెక్స్ కు సంబంధించి ఇండియన్స్ మనోభావాలలో మార్పు రావాలంటే చాలా కాలమే పడుతుందంటూ కోర్టుకు విన్నవించారు. అయితే సదరు డిఫెన్స్ లాయర్ వాదనలతో ఏకీభవించని కోర్టు.. అతను పుట్టి పెరిగిన పరిస్థితులు ఏవైనా అతను చేసిన నేరాన్ని క్షమించలేమని పేర్కొంది. దీనిపై ఆస్ట్రేలియా నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇండియాకు కల్చర్ ఉంటే, ఆస్ట్రేలియాకు ఓ కల్చర్ ఉందని, చట్టాలను ఉల్లంఘించిన వాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.

English summary
In India, people have blamed ‘women wearing Western clothes’ and ‘eating chowmein’ for rape, which clearly emphasises the need for sex education at an early age in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X