కుమ్మేసింది: రెజ్లర్‌తో హర్యానా మాజీ మహిళ పోలీస్ (వీడియో)
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. మనో ధైర్యంతో కొండనైనా పిండి చేయవచ్చనే ఓ యువతి రుజువు చేసింది. ది గ్రేట్ ఖలీ నిర్వహించిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుకు వేదికగా నిలిచింది. పంజాబీ యువతి చేసిన సాహసాన్ని అక్కడున్నవారంత చప్పట్లతో అభినందించారు.
వివరాల్లోకి వెళితే... కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోటీల్లో భాగంగా మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ రింగ్‌లో నుంచి ఓ సవాల్ విసిరింది. దమ్ము, ధైర్యం ఉన్నవాళ్ళెవరైనా వచ్చి తనతో తలపడాలని సవాల్ విసిరింది. చాలా సేపటి వరకు ఎవరూ ముందుకెళ్ళలేదు.
ఇంతలో పసుపు రంగు సల్వార్, కమీజ్ ధరించిన ఓ యువతి ఆ సవాల్‌ను స్వీకరించింది. ''నేనున్నాను'' అని దూసుకెళ్ళింది. ఆమె పేరు కవిత. వడివడిగా అడుగులేస్తూ వేదికపైకి వెళ్ళింది. బీబీ బుల్ బుల్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ఇంతలో బుల్ బుల్ ఒక్క ఉదుటున ఆమెను కిందకు తోసేసింది.
దీంతో ఖంగుతిన్న ఆమె ఆ తర్వాత లేచి బుల్ బుల్‌ను కుమ్మేసింది. అమాంతం పైకెత్తి కిందకు పడేసింది. అనంతరం పిడిగుద్దులు కురిపిస్తుంటే బుల్ బుల్ నోట మాట రాలేదు. ఇంతలో ఇతర రెజ్లర్లు వచ్చి అడ్డుకున్నా మరితంగా రెచ్చిపోయి బుల్ బుల్‌ను మట్టికరిపించింది.
2015లో చోటు చేసుకున్న ఈ వీడియో తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఇక కవిత విషయానికి వస్తే ఓ పంజాబీ అమ్మాయి. రెజ్లర్ కాదు, గతంలో హర్యానా పోలీసు శాఖలో ఉద్యోగం చేశారు. పవర్ లిప్టింగ్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ కూడా.












Click it and Unblock the Notifications