రజనీకాంత్ మద్దతుతో డీఎంకే అభ్యర్ధి! తేల్చేసిన తలైవా

తమిళనాడు అసెంబ్లీ సమరానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో చెన్నై రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. ముఖ్యంగా స్టార్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ' థౌజండ్ లైట్స్' (Thousand Lights) నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, డీఎంకే అభ్యర్థి డాక్టర్ ఎళీలన్.. స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇది మర్యాదపూర్వక భేటీనా? లేక వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అన్న చర్చ మొదలైంది.

సోమవారం ఉదయం చెన్నైలోని పోయస్ గార్డెన్ సందడిగా మారింది. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న డాక్టర్ ఎళీలన్.. రజనీకాంత్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను సూపర్ స్టార్‌కు అందించి, చర్చించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ను 'మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ' అని అభివర్ణిస్తూ ఎళీలన్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Thousand Lights Battle DMK MLA Dr Ezhilan Meets Superstar Rajinikanth Ahead of 2026 Tamil Nadu Elections

ఓటు కోసమేనా? సంప్రదాయమేనా?

నిజానికి రజనీకాంత్ నివాసం ఉండేది ఇదే నియోజకవర్గ పరిధిలో. ఓటరుగా రజనీ ఆశీస్సులు పొందడం ఇక్కడి అభ్యర్థులకు దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే, గతంలో కరుణానిధికి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన ఎళీలన్‌కు రజనీతో ఉన్న పాత పరిచయాలు కూడా ఈ భేటీకి బలమైన కారణంగా కనిపిస్తున్నాయి. రజనీకాంత్ ఇప్పటివరకు ఏ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎళీలన్ ఆయనను కలవడం వెనుక డీఎంకే ఓటు బ్యాంక్‌ను భద్రపరుచుకునే వ్యూహం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

థౌజండ్ లైట్స్ పోరు.. ఈసారి మామూలుగా లేదు!

ఈ నియోజకవర్గంలో ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొంది.

  • డీఎంకే: సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎళీలన్ (విజయ పరంపరను కొనసాగించాలని పట్టుదల)
  • అన్నాడీఎంకే: మాజీ మంత్రి వలర్మతి (గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధం)
  • NTK: ప్రముఖ దర్శకుడు కళంజియం (సీమాన్ పార్టీ తరపున బరిలో)
  • TVK: జేసీడీ ప్రభాకర్ (విజయ్ పార్టీ మద్దతుతో కొత్త లెక్కలు)

గత 2021 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఖుష్బు సుందర్‌పై 32 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఎళీలన్ ఘన విజయం సాధించారు. అయితే ఈసారి కొత్త పార్టీల రంగప్రవేశం, మారుతున్న సమీకరణాల మధ్య 'వెయ్యి దీపాల' వెలుగు ఎవరి ఇంట నిలుస్తుందో చూడాలి. రజనీకాంత్ వంటి స్టార్ పవర్ ఉన్న ఓటర్ల మద్దతు ఎవరికి ఉన్నా, అది గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+