Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబై విమానాశ్ర‌యాన్ని కూల్చివేస్తామంటూ బెదిరింపు...

ఈ మ‌ధ్య‌కాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువ‌య్యాయి. మొన్న‌టికి మొన్న రిల‌య‌న్స్ అధినేత ముకేష్ అంబానీని చంపేస్తామ‌ని వ‌చ్చిన ఓ బెదిరింపు కాల్ సంచ‌ల‌నం సృష్టించింది. ఆ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే ఇప్పుడు తాజాగా ముంబ‌యి విమానాశ్ర‌యాన్ని కూల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. ఏకంగా ఎయిర్ పోర్టునే పేల్చేస్తామంటూ మరో బెదిరింపు వచ్చింది. అయితే, ఈ మెయిల్ పంపిన వ్యక్తి పేలుడును నివారించడానికి 48 గంటల్లో బిట్‌కాయిన్‌లో 1 మిలియన్ డాలర్లు పంపించాలని డిమాండ్ చేయ‌డం జ‌రిగింది.

గురువారం ఉదయం 11 గంట‌ల స‌మ‌యంలో బెదిరింపు మెయిల్..:ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ విమానాశ్ర‌యం దేశ, విదేశీ ప్రయాణికులతో నిత్యం ఎంతో ర‌ద్దీగా ఉంటుంది. విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ వ‌చ్చిన బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. విమానాశ్రయంలోని టెర్మినల్ 2 ని బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ పంపడం జ‌రిగింది. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు సెక్యూరిటీని మ‌రింత పెంచారు. అంతేకాకుండా 48గంటల్లో అడిగిన మొత్తాన్ని బిట్ కాయిన్ల రూపంలో అందించాల‌ని ఆ ఆగంత‌కుడు మెయిల్‌లో పేర్కొన్నాడు. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు గురువారం ఉదయం 11 గంట‌ల స‌మ‌యంలో ఈ బెదిరింపు మెయిల్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపు మెయిల్ పై స్పందించిన విమానాశ్ర‌య అధికారులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్ర‌క్రియను వేగ‌వంతం చేశారు. ఏ ఐడీ నుండి ఈ బెదిరింపు మెయిల్ వ‌చ్చిందోన‌ని తెలుసుకునే ప్ర‌య‌త్నం పోలీసులు చేస్తున్నారు. విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బెదిరించిన దుండగులు ఎవరో సాంకేతికతను ఉపయోగించి మ‌రీ క‌నిపెడ‌తామ‌ని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Threat to demolish Mumbai airport

48 గంట‌ల్లో టెర్నిన‌ల్ 2ని పేల్చివేస్తాం...:ఆగంత‌కుడు పంపిన బెదిరింపు మెయిల్‌లో ఇలా ఉంది...విమానాశ్రయానికి చివరి హెచ్చరిక. బిట్‌కాయిన్‌లోని ఒక మిలియన్ డాలర్లను ఈ చిరునామాకు బదిలీ చేయకపోతే మేం 48 గంటల్లో ముంబయి విమానాశ్రయంలోని టెర్మినల్ 2ని పేల్చివేస్తాం. 24 గంటల తర్వాత మరో హెచ్చరిక ఉంటుంది'' అంటూ మెయిల్‌లో బెదిరించ‌డం జ‌రిగింది. బాంబులతో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామనే వ‌చ్చిన మెయిల్ బెదిరింపుపై ముంబయి పోలీసులు ఐపీసీ 385,505(1) బి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయ‌డం ప్రారంభించారు. అయితే, గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే చోటుచేసుకున్నాయి. ముంబయి విమానాశ్రయానికి తరచూ బాంబు పెట్టామంటూ పలు సార్లు బెదిరింపులు కాల్స్ వంటివి వచ్చాయి. ఇలా బెదిరింపులు వచ్చిన ప్రతీసారి విమానాశ్రయం అధికారులు అప్రమత్తమై పోలీసు బలగాలతో ముమ్మర తనిఖీలు చేప‌ట్టేవారు. ఈ బెదిరింపుతో ముంబయి విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించ‌డం జ‌రిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+