ఉగ్రదాడి: ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
కుప్వారా: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సోమవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లతో పాటు ఓ ఉగ్రవాది మరణించాడు. ఆరు మంది జవాన్లకు గాయాలైనాయి.
కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని బీఎస్ఎఫ్ బలగాలకు సమాచారం వచ్చింది. సోమవారం భద్రతా దళాలు ఆ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి.

లొంగిపోవాలని ఉగ్రవాదులను భద్రతా దళాలు హెచ్చరించాయి. ఆ సందర్బంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు.
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది అంతం అయ్యాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది గురించి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications