మూడు ఏనుగుల మృతికి కారణమయిన గూడ్స్ రైలు సీజ్...
భారతదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యంతో ఉండడంతో చాలామంది ప్రయాణికులు రైలు మార్గానే ఎంపిక చేసుకుంటుంటారు. ఈ రైళ్లు ఎక్కడిక్కడివారినో తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఇవి అడవుల గుండా కూడా ప్రయాణిస్తుంటాయి. ఆ క్రమంలో చాలా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని వన్యప్రాణులు కూడా మృత్యుబారిన పడుతుంటాయి. తాజాగా అలాంటి ఓ ఘటనే పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. గూడ్స్ రైలుకు అడ్డంగా వచ్చిన మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో అటవీశాఖ అధికారులు ఆ గూడ్స్ రైలును సీజ్ చేయడం జరిగింది.
రైలును సీజన్ చేసిన అటవీశాఖ అధికారులు...:పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్ దువార్నుంచి సిలిగురిం వెళుతున్న గూడ్స్ రైలు రాజభట్ ఖావా వద్ద అడవి మార్గం ప్రయాణిస్తుంది. ఆ సయమంలో రైలుకు అడ్డుగా మూడు ఏనుగులు వచ్చాయి. దాంతో అవి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాయి. అలీపుర్‌ద్వార్ జిల్లాలో రాజభట్ఖావా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 7.20 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో గూడ్స్ రైలును అటవీశాఖ అధికారులు సీజ్ చేయడం జరిగింది.

ఐడీఎస్ లేకపోవడం వల్లే ఏనుగులు మృతిచెందాయి...:ఈ విషయంపై చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రామ్ మాట్లాడారు. రైలును సీజ్ చేయటమంటే అది సాంకేతికమైనదని, రైలును
భౌతికంగా స్వాధీనపరచుకోవటం కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆ గూడ్స్ రైలు ఉందని స్పష్టం చేశారు. కేవలం పేపర్స్ విషయంలో మాత్రమే సీజ్ ప్రక్రియను జరిపామని ఆయన అన్నారు. ఈ మార్గంలో ఐడీఎస్ లేదని చెప్పారు. ఐడీఎస్ మార్గం అంటే...పట్టాలపైకి ఏమైనా అడ్డంగా వస్తే గుర్తించి అప్రమత్తం చేసేది. అయితే, ఈ మార్గంలో ఐడీఎస్ లేదని రైల్వే అధికారులు చెప్పడం జరిగింది. ఐడీఎస్ ఉన్నచోట ఏనుగులను రైళ్లు ఢీకొన్న ఘటనలు లేవని ఈ సందర్బంగా ఆయన వివరించారు. ఇందులో భాగంగానే గూడ్స్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications