ఒడిషాలో కారును ఢీకొన్న రైలు: ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: ఒడిషాలో రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ కారును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం నౌపాడా జిల్లాలోని కళ్యాణ్‌పూర్ రైల్వే క్రాసింగ్ లైన్‌కి సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న కారుని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు డీఎస్పీ సునీల్ జోషి తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
ఆదివారం ఉదయం అస్సాంలోని సోనిత్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.












Click it and Unblock the Notifications