కుమార్తెకు విషం పెట్టి హత్య: తరువాత దంపతులు ఆత్మహత్య, ఒకే చోట ముగ్గురూ !

మూడేళ్ల కుమార్తెకు విషం తాగించి హత్య చేశారు.దంపతులు విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.ఒకే కుటుంబంలో ముగ్గురూ మృతి, ఏం జరిగిందంటే ?

బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన దంపతులు మూడేళ్ల కుమార్తెకు విషం తాగించి హత్య చేసి తరువాత వారు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లా కూడ్లగి తాలుకాలో జరిగింది. ఒకే కుటుంబంలో అందరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

కోట్టూరులో మృత్యుంజయ (48), మధు (40) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న బిందు అనే కుమార్తె ఉంది. మంగళవారం రాత్రి బంధువులతో మాట్లాడి వారి ఇంటికి వెళ్లి నిద్రపోయారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి బంధువులతో మాట్లాడారు.

Three members of a family have committed suicide by consuming poison in Bellary district.

మృత్యుంజయ, మధు దంపతులు తరువాత ఇంటిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో వారి బంధువులకు అనుమానం వచ్చి ఇంటి తలుపుకొట్టారు. ఎంత సేపటికి స్పందన లేకపోవడంతో తలుపులు పలగొట్టి చూశారు. అందరూ ఇంటిలో ఓ మూలలో శవమై కనించారు. మృత్యుంజయ, మధు దంపతులు పాపను హత్య చేసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+